Good news for students New Menu implemented: విద్యార్థులకు గుడ్‌న్యూస్ ఇక నుంచి విద్యార్థులకు కొత్త మెనూ..
కరీంనగర్: ప్రభుత్వం 40శాతం డైట్, 200శాతం కాస్మొటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలో కొత్త మెనూ అమలుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. వసతి గృహాల ప్రత్యేక అధికారులు, వెల్ఫేర్ అధికారులు, వార్డెన్లతో కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని వసతి గృహాల్లోని విద్యార్థులకు ఒకే రకమైన మెనూను ప్రభుత్వం అమలు చేయడం హర్షణీయమని అన్నారు.
గ్రూప్ 2 పరీక్షలకు కొత్త నిబంధనలు.. ఈ విషయాలు పాటించకపోతే ఇక అంతే: Click Here
ఈనెల 14న జిల్లాలోని 110 సంక్షేమ హాస్టళ్లలో నూతన డైట్ విధానం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజా ప్రతినిధులను, విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించాలని సూచించారు. అన్ని హాస్టళ్లలో శుభ్రమైన నీటితో వంట చేయాలని, నూతన మెనూ విధానాన్ని ప్రదర్శించాలని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్‌దేశాయ్ మాట్లాడుతూ సరఫరాదారు నాణ్యమైన సరుకులు అందించని పక్షంలో కాంట్రాక్ట్ రద్దు చేయాలని సూచించారు.
వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, సోలార్ వాటర్ హీటర్లను మరమ్మతు చేయించాలన్నారు. హాస్టళ్లలో మరమ్మతులు అవసరమైతే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈవో జనార్దన్‌రావు, ఎస్సీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ నాగలేశ్వర్, డీఆర్వో వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.