Students 10000 Rupees Scholarship News: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ 10వేల స్కాలర్‌షిప్‌ గుర్తింపు సర్టిఫికెట్‌ కూడా..

Latest Scholarships news

ట్రక్‌ డ్రైవర్ల కుమార్తెల ఉన్నత చదువుల కోసం మహీంద్రా గ్రూప్‌ ఉపకారవేతనాలు అందిస్తుంది. మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ (ఎంటీబీడీ) ఆధ్వర్యంలో డ్రైవర్స్ డే 2024ని పురస్కరించుకుని ‘మహీంద్రా సార్థి అభియాన్’ పేరుతో స్కాలర్‌షిప్‌లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రకటించింది. 2025 సంవత్సరానికిగాను ప్రతిభావంతులైన 1000 మంది విద్యార్థినులకు పైచదువుల కోసం రూ.10 వేలు చొప్పున ఉపకారవేతనం ఇవ్వనున్నారు.

మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు వినోద్ సహాయ్ మాట్లాడుతూ..‘మహీంద్రా సార్థి అభియాన్ ద్వారా ట్రక్‌ డ్రైవర్ల కుమార్తెల ఉన్నత చదువుల కోసం సాయం చేస్తున్నాం. మహిళాసాధికారతకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పదో తరగతి పూర్తయి పైచదువులు చదివాలనుకునే ప్రతి ట్రక్‌ డ్రైవర్‌ కుమార్తె ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ‍స్కాలర్‌షిప్‌లకు ఎంపికైన అభ్యర్థులకు రూ.10,000 ఇవ్వడంతోపాటు గుర్తింపు సర్టిఫికెట్‌ కూడా అందిస్తాం’ అని తెలిపారు.

ఇదీ  చదవండి: Panchayat Raj Department Jobs

ఈ తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మొట్టమొదటి కమర్షియల్ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా కావడం విశేషం అని అధికారులు తెలిపారు. 2014లో ఈ పథకాన్ని ప్రారంభించిన కంపెనీ ఇప్పటివరకు 10,029 మందికి ఉపకారవేతనాలు అందించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 75 ట్రాన్స్‌పోర్ట్ హబ్‌లను గుర్తించి ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. 2025 ఫిబ్రవరి నుంచి మార్చి వరకు దరఖాస్తు గడువుగా నిర్ణయించారు. విద్యార్థినుల మెరిట్‌, కంపెనీ నిబంధనల ఆధారంగా స్క్రీనింగ్‌ చేసి స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు. ఇందుకోసం సంస్థ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తుంది.

#Tags