Fact Check: ‘చిన్నారుల భవితను చిదిమేసే యత్నం’.. ప్రభుత్వ బడిలో ఇంగ్లిష్‌ చదివితే వెనుకబడిపోతున్నారట..!

పేదలకు మంచి చదువు అందించి, వారిని ఉన్నత స్థాయికి చేర్చాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం.

ప్రపంచ పోటీని తట్టుకుని, విజయం సాధించేలా పేదల పిల్లలకు చదువు, సదుపాయాలు అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లకంటే మిన్నగా రూపుదిద్దారు. బడుగుల పిల్లలకు అంతర్జాతీయ స్థాయి బోధన అందిస్తున్నారు. ఇంగ్లిష్‌ మీడియంతో పిల్లల బంగారు భవితకు బాటలు పడుతున్నాయి. 

సిలబస్‌ ఒక్కటే..
సిలబస్‌తో సర్కస్‌ అంటూ రాసిన రాతల్లో వాస్తవమే లేదు. రాష్ట్రంలోని 1,000 స్కూళ్లు సీబీఎస్‌ఈ బోర్డుకి అనుసంధానించారు. 44,478 స్కూళ్లలోనూ ఎన్సీఈఆర్టీ సిలబస్‌ మాత్రమే బోధిస్తున్నారు. పరీక్షలు నిర్వహించే బోర్డులు వేరయినా, సిలబస్‌ మాత్రం ఒకటే. ప్రైవేటు పాఠశాలల్లోనూ ఇదే విధానం అమల్లో ఉంది. మొదటగా వచ్చే ఏడాది పదో తరగతి బ్యాచ్‌ విద్యార్థులు సీబీఎస్‌ఈ పరీక్షలు రాస్తారు.

ఇంగ్లిష్‌ చదవలేని పరిస్థితి ఎక్కడ ఉంది..?
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఇంగ్లిష్‌ మీడియంపై గల ఆసక్తి, వారి అభిప్రాయం మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పిల్లల్లో ఇంగ్లిష్‌ భాషా నైపుణ్యాన్ని పెంచేందుకు బైలింగ్యువల్‌ పుస్తకాలు, డిక్షనరీలు అందించారు. ఇటీవల ముగిసిన ఫార్మేటివ్‌తో పాటు సమ్మేటివ్‌–1 పరీక్షలను 93 శాతం పైగా విద్యార్థులు ఇంగ్లిష్‌లోనే రాశారు.

మరి ఇంగ్లిష్‌ చదవలేని పరిస్థితి ఎక్కడుంది? టోఫెల్‌లో కమ్యూనికేషన్స్‌ స్కిల్స్, ఇంగ్లిష్‌ స్పీకింగ్‌ స్కిల్స్, లిజనింగ్‌ స్కిల్స్‌ను స్మార్ట్‌ టీవీలు, ఐఎఫ్‌పీల ద్వారా శిక్షణనిస్తోంది. ఇందుకోసం స్కూళ్లలో ప్రత్యేకంగా పీరియడ్‌ కేటాయించారు.

బోధనను ఆంగ్లం బోధించే ఉపాధ్యా­యులకు అప్పగించారు. ఆంగ్లం డిగ్రీ, పీజీ స్థాయి విద్యార్హత ఉన్న ఇతర సబ్జెక్టు ఉపాధ్యాయులు కూడా టోఫెల్‌ బోధించవచ్చు. తెలుగు ఉపాధ్యాయులకు ఈ బాధ్యత అప్పగించలేదు.

IB Education in AP Schools: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో... IB(ఇంటర్నేషనల్ బకలారియేట్) - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ SCERT మధ్య ఒప్పందం!!

ఐబీ సుదీర్ఘ ప్రక్రియ..
ఐబీ కరిక్యులమ్‌లో విద్యార్థులకు కరిక్యులమ్‌తో పాటు కో–కరిక్యులమ్‌ అంశాలను కూడా నేర్పిస్తారు. ఇది 2025 జూన్‌ నుంచి ఏటా ఒక తరగతికి పెంచే 10 సంవత్సరాల సుదీర్ఘ ప్రక్రియ. ఒకేసారి ఉపాధ్యాయులు, విద్యార్థులపై భారం పడేది కాదు. ఐబీ విద్యతో విద్యార్థుల నైపుణ్యాలను అంతర్జాతీయ స్థాయికి పెరుగుతాయి.

ఐబీ సర్టిఫి­కెట్లకు అంతర్జాతీయంగా విలువ ఉంటుంది. ప్రభు­త్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యను ఉచితంగా అందించడానికి పటిష్ట­మైన ప్రణాళిక, సమర్థవంతమైన భాగస్వాముల సహ­కా­రం విద్యా శాఖ తీసుకుంది. ట్యాబ్స్‌ ద్వారా విద్యా­ర్థులకు ఉత్తమమైన ఈ కంటెంట్‌ను అంది­స్తున్నారు.

వీటిలో భాగంగా బైజూస్‌ ఈ కంటెంట్‌ను ఉపాధ్యా­యులకు, విద్యార్థులకు అందించింది. పాఠ్య పుస్తకా­ల్లోని కాన్సెప్టులను సులభ శైలిలో దృశ్య–శ్రవణ మాధ్యమాల్లో బోధిస్తోంది. దీనివల్ల ఉపాధ్యాయు­లకు బోధన సులభం అవడంతో పాటు విద్యార్థుల్లో అవగాహన సామర్థ్యాలు మెరుగుపడుతున్నాయి. 

తల్లిదండ్రులకు సర్వే వివరాలు.. 
సర్వేలు వ్యవస్థ బలాబలాలను తెలుసుకుని, మెరుగైన విధానాలు రూపొందించేందుకు ఉద్దేశించినవి. గత సర్వేల ఆధారంగా టీచింగ్‌ ఎట్‌ రైట్‌ లెవెల్, లిప్, సాల్ట్‌ తదితర కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నారు.

విద్యార్థుల ఫలితాలు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఎక్కడా ఉంచరు. టెన్త్‌లో కూడా విద్యార్థుల వ్యక్తిగత ఫలితాలు వెబ్‌సైట్‌లో ఉంచరన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతి పాఠశాలలో ప్రభుత్వం చేసిన సర్వే వివరాలు వారి తల్లిదండ్రులకు అందుబాటులో ఉంచారు.

Nadu Nedu Scheme: ‘మా బడి – మంచి గుడి’ నాడు-నేడు అమ‌లుపై అభిప్రాయాలు ఇవే..

సర్వే రిపోర్టులతో శాస్త్రీయంగా సంస్కరణల..
గత ప్రభుత్వం కార్పొరేట్‌ పాఠశాలలకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రభుత్వ పాఠశాలలకు ఇవ్వకపోవడంతో విద్యా వ్యవస్థ దిగజారిందని ఆసర్, నాస్‌ వంటి సర్వేలు తేల్చాయి. దాంతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నాణ్యతను పెంచుతోంది.

టీచింగ్‌ ఎట్‌ రైట్‌ లెవెల్, లెర్నింగ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం, సపోర్టింగ్‌ ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ వంటి కార్యక్రమాలు వీటిలో కొన్ని. ఆసర్‌ నివేదిక ఆధారంగా రూపొందించిన టీచింగ్‌ ఎట్‌ రైట్‌ లెవెల్‌ కార్యక్రమంలో విద్యా బోధనలో నూతన విధానాలను అవలంభిస్తున్నారు. ఇందుకోసం ప్రథమ్‌ సంస్థతో కలిసి టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌ను అన్ని స్కూళ్లకు అందించారు.

ఇది సత్ఫలితాలనిస్తోంది. ఎంపిక చేసిన కొన్ని జిల్లాల్లో ప్రాథమి­కోన్నత స్థాయిలో అభ్యసన సామర్థ్యా­లు మెరుగుపరిచేందుకు ‘లిప్‌’ ప్రోగ్రాం అందిస్తున్నారు. ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్స్‌కు ‘కేంద్రీకృత ప్రశ్న పత్రాల తయారీ’ విధానం ద్వారా అన్ని పాఠశాలల్లో ఒకే తరహా ప్రశ్నపత్రాలు విద్యార్థులకు అందిస్తున్నారు. విద్యార్థుల తప్పులను శాస్త్రీయంగా విశ్లేషించి నిపుణులతో వీడియోలను రూపొందించి అందజేస్తున్నారు.

చదవండి: India Today Education Summit 2024: తిరుపతి ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో పాల్గొన్న‌ సీఎం జగన్

#Tags