Digital Education: దివ్యాంగులకు డిజిటల్ బోధనతో విద్యాభివృద్ధి..
సాక్షి ఎడ్యుకేషన్: ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు బోధనలో డిజిటల్ విద్యను ఉపయోగించడం ద్వారా సాధారణ విద్యార్థులతో పాటు దివ్యాంగులకు ఎనలేని ప్రయోజనం చేకూరుతుందని అన్నమయ్య జిల్లా విద్యాశాఖాధికారి యు.శివప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం అన్నమయ్య జిల్లా విద్యా శిక్షణ సంస్థలో సమగ్ర శిక్ష సహిత విద్య జిల్లా సమన్వయకర్త కె.జనార్దన ఆధ్వర్యంలో ‘‘విజన్–2025 ఇంక్లూజివ్ ఆంధ్ర’’ డిజిటల్ పెడగాగి మీద ప్రత్యేక విద్య ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
APPSC Group-2 Prelims Exam 2024 : అభ్యర్థులకు అలర్ట్.. గ్రూప్-2 పరీక్షపై కీలక ప్రకటన..
ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచుకుని విద్యార్థులకు అందివ్వాలన్నారు. జిల్లాలోని 90 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు, 77 మంది సహిత విద్యా ఉపాధ్యాయులకు ట్యాబ్‌లను ఇచ్చామన్నారు. వాటిని ఉపయోగించుకుని విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించాలని సూచించారు. రీసోర్స్ పర్సన్‌లు బి.మహాలక్ష్మీనాయుడు, పి.సునీల్‌లు ట్యాబ్‌ల వినియోగంపై అవగాహన కల్పించారు. జిల్లా డైట్ ప్రిన్సిపల్ అజయ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ కె.శ్రీనివాసరాజు, జిల్లాలోని స్కూల్ అసిస్టెంట్ ప్రత్యేక ఉపాధ్యాయులు, ఐఈఆర్‌పీలు తదితరులు పాల్గొన్నారు.