Schools and Colleges Dussehra Holidays 2024 : ఈ సారి స్కూల్స్‌, కాలేజీల‌కు భారీగా దసరా సెలవులు.. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌.. మొత్తం ఎన్ని రోజులంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : స్కూల్స్‌, కాలేజీల విద్యార్థుల‌కు వ‌చ్చే నెల అక్టోబ‌ర్ భారీగా సెల‌వులు రానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండ‌గైన ద‌స‌రా, దీపావళి ఇదే నెల‌లో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వాలు ఈ సారి ముందుగానే ద‌స‌రా సెల‌వుల తేదీల‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెల్సిందే.

తెలంగాణ‌లో అయితే.. బతుకమ్మ, దసరా పండుగలకు కలిపి ఒకేసారి తెలంగాణ విద్యాశాఖ సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.  తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. అందుకే స్కూల్స్, కాలేజీలకు ముందుగానే హాలీడేస్ ను ప్ర‌క‌టించారు. విద్యార్థులు.. వీరి కుటుంబ స‌భ్యులు సొంత ఊర్ల‌కు.. లేదా ఏదైన టూర్‌కి వెళ్లే వారు ఇప్ప‌టికే ఈ సెల‌వుల ప్ర‌కారం ప్లాన్ చేసుకుంటున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు ద‌స‌రా పండ‌గ సెల‌వులు ఇలా..

ఈ సారి ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూళ్లకు దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మొత్తం 10 రోజులు సెలవులను ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌క‌టించి ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్దపండుగలో దసరా, సంక్రాంతిలకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండు పండ‌గ‌ల‌కు ప్ర‌భుత్వం ప్ర‌తి ఏడాది భారీగా సెల‌వులు ఇస్తున్న విష‌యం తెల్సిందే. ఈ పండుగలను తెలుగు ప్రజలు అంగరంగవైభవంగా చేసుకుంటారు. ఈ క్రమంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అన్ని సూళ్లకు ప్రభుత్వం ద‌స‌రా పండుగ సెలవులను ప్రకటించింది. ఈ మేర‌కు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏపీ అకడమిక్ క్యాలెండర్‌లో గ‌తంలో విడుదల చేసిన విష‌యం తెల్సిందే. అలాగే అక్టోబ‌ర్ నెల‌లో మ‌రో పండ‌గ దీపావళి అక్టోబరు 31వ తేదీ (గురువారం) అన్ని స్కూల్స్‌, కాలేజీల‌కు, ఆఫీసుల‌కు సెల‌వు ఉంటుంది. అయితే ప్ర‌భుత్వ‌,  ప్రైవేట్‌ ఆఫీస్‌ల‌కు మాత్రం కేవ‌లం ద‌స‌రా పండ‌గ రోజు మాత్ర‌మే... సెల‌వులు ఉండనున్న‌ది.

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

తెలంగాణ‌లో స్కూల్స్‌కు, కాలేజీల‌కు భారీగానే ద‌స‌రా సెల‌వులు...

ఈ సారి ఏపీలో కంటే... తెలంగాణ‌లో భారీగా ద‌ర‌రా సెల‌వులు రానున్నాయి. తెలంగాణ‌లో బతుకమ్మ, దసరా పండుగలకు కలిపి ఒకేసారి జ‌రుపుకుంటున్న విష‌యం తెల్సిందే. ఇక్క‌డ బతుకమ్మ, దసరా పండుగ‌ల‌ను అత్యంత ఘ‌నంగా జ‌రుపుకుంటారు. ఈ మేరకు తెలంగాణలో దసరా సెలవులు అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అనగా 12 రోజులు హలీడేస్‌ రానున్నాయి. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో దసరా సెలవులు తక్కువగా ఉండనున్నాయి. ఈ సెలవులు ప్రభుత్వ,  ప్రైవేటు పాఠశాలలకు సమానంగా వర్తిస్తాయి. ఈ మేర‌కు అకాడమిక్‌ క్యాలెండర్‌లో దీనిపై ప్రకటన చేశారు. ఈ నెల‌లోనే మ‌రో పండ‌గ దీపావళి అక్టోబరు 31వ తేదీ (గురువారం) అన్ని స్కూల్స్‌, కాలేజీల‌కు, ఆఫీసుల‌కు సెల‌వు ఇచ్చిన విష‌యం తెల్సిందే.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

2024-25 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన‌ సెలవులు ఇవే..

☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి

➤☛ దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13 వరకు ఉండనున్నాయి.
➤☛ క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.
➤☛ అక్టోబరు 31న దీపావళి సెలవు
➤☛ డిసెంబరు 25న క్రిస్మస్, క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు.
➤☛ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు.

☛ Follow our YouTube Channel (Click Here)

☛ Follow our Instagram Page (Click Here)

#Tags