Education News: ఏపీలో కొత్తగా 8 కేంద్రీయ విద్యాలయాలు ......తెలంగాణలో ఏడు కేంద్రీయ విద్యాలయాలు

Education News: ఏపీలో కొత్తగా 8 కేంద్రీయ విద్యాలయాలు ......తెలంగాణలో ఏడు కేంద్రీయ విద్యాలయాలు

ఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో నూతనంగా 85 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.5,872 కోట్ల రూపాయలతో 8 ఏళ్ల కాలంలో స్కూళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

దేశంలో ప్రస్తుతం 1256 కేంద్రీయ విద్యాలయాలు ఉండగా, ఏపీలో కొత్తగా మరో ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. అనకాపల్లి, వలసపల్లి , పాల సముద్రం, తాళ్లపల్లి నందిగామ, రొంపిచర్ల, నూజివీడు, డోన్‌లలో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.

ఇవి కూడా చదవండి: కేజీబీవీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..

దేశవ్యాప్తంగా 28 కొత్త నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణలో ఏడు జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు  కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, సూర్యాపేటలలో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.ఇవి కూడా చదవండి:   తెలంగాణ‌ హోంగార్డుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త‌.. ఇక‌పై జీతం రెట్టింపు.. ఎంతంటే..!

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags