Indian Railway Jobs 2024 : ఎలాంటి రాత ప‌రీక్ష లేకుండానే... రైల్వేలో 5,066 పోస్టులు.. అర్హ‌త‌లు ఇవే...

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇండియ‌న్ రైల్వే ఇటీవ‌ల కాలం భారీగా ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ల‌ను వ‌రుస‌గా ఇస్తుంది. టెన్త్ ,ఐటీఐ, ఇంట‌ర్ అర్హ‌త‌తోనే ఎక్కువగా రైల్వే ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇస్తున్నారు.

తాజాగా ముంబయి ప్రధాన కేంద్రంగా గల రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ) వెస్ట్రన్‌ రైల్వే 2024-25 సంవత్సరానికి వెస్ట్రన్‌ రైల్వే పరిధిలోని డివిజన్‌/వర్క్‌షాప్‌లలో 5,066 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

అర్హతలు ఇవే..: 
పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వ‌య‌స్సు : 
సెప్టెంబ‌ర్ 22, 2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం : 
ఈ పోస్టుల‌ను పదో తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష, ఇంట‌ర్వ్యూ ఉండదు. శిక్ష‌ణ కాలం ఒక సంవత్సరం ఉంటుంది.

ట్రేడ్‌లు :
ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్, పీఎస్‌ఏఏ, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వైర్‌మ్యాన్, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్‌ ఏసీ, పైప్ ఫిట్టర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, స్టెనోగ్రాఫర్, ఫోర్జర్ అండ్‌ హీట్ ట్రీటర్.

ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ : 
ఈ అప్రెంటిస్‌కు అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 22వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

పూర్తి వివ‌రాలు ఇవే..

#Tags