Tribal Student Mangala Muduli : ఈ అడ‌వి బిడ్డ‌.. కొండలు వాగులు దాటుకుంటూ.. చ‌దివి నీట్ ర్యాంక్ కొట్టాడిలా.. ఈత‌ని రియ‌ల్ లైఫ్ స్టోరీకి..

ఓ మారుమూల అటవీ ప్రాంతంలో పుట్టి పెరిగి.. జీవ‌న పోరాటంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నా ధైర్యంగా ముందడుగు వేశాడు. ఎంతో కష్టతరమైన నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పరీక్షలో అర్హత సాధించి, మంచి కాలేజీలో సీటు సాధించాడు.

అనుకున్నది సాధించాలనే తపన, క‌సి ఉంటే.. ఎలాంటి ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఓ ఆదివాసీ కుర్రాడు. ఈత‌నే.. ఒడిశాలోని బోండా తెగకు చెందిన మంగళ ముదులి. ఈ నేప‌థ్యంలో మంగళ ముదులి రియ‌ల్ లైఫ్ స్టోరీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం : 
మంగళ ముదులి.. ఒడిశా రాష్ట్రానికి చెందిన బోండా తెగకు చెందిన కుర్రాడు. అడవి, కొండల్లోనే నివాసం. తల్లిదండ్రులు చిన్నతరహా అటవీ ఉత్పత్తులు అమ్ముకుంటూ జీవినం సాగిస్తూ ఉంటారు. 

☛ NEET Ranker Success Story : పొద్దున పూట కూలీ ప‌ని చేశా.. రాత్రి పూట చదివా.. అనుకున్న‌ట్టే.. నీట్‌లో మంచి ర్యాంక్‌ కొట్టానిలా..

ఎడ్యుకేష‌న్ : 

మంగళ ముదులికి చిన్నతనం నుంచి చదువంటే చాలా ఇష్టం. ఒక విధంగా చెప్పాలంటే చదువంటే కసి. ఎందుకంటే.. త‌న వాళ్ల ప‌డుతున్న క‌ష్టం చాలా.. దీని స‌రైన స‌మాధానం చెప్పాలంటే.. చ‌దువే ఏకైన మార్గం అని బలంగా న‌మ్మాడు. ముదులి స్కూల్‌కు వెళ్లాలంటే.. 5 కిలోమీటర్ల కాలి నడకన వెళ్లాలి. అది కూడా కొండలు గుట్టలు దాటుకుంటూ.. ఒక విధంగా ట్రెక్కింగ్‌ చేస్తూ పోవాలి. స్థానిక రెసిడెన్షియల్‌ స్కూల్‌లో పదో తరగతి పూర్తి చేశాడు. ఇంటర్‌ కోసం.. తన గూడెం నుంచి 25 కిలో మీటర్ల దూరంలో ఉండే కాలేజీకి వెళ్తూనే.. నీట్‌(నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) కోసం కూడా ప్రిపేర్‌ అయ్యారు. చదువుపై ముదులికి ఉన్న ఇష్టం చూసి.. స్కూల్‌లో అతనికి పాఠాలు చెప్పిన ఓ టీచర్‌.. అతని నీట్‌ కోచింగ్‌ కోసం సాయం చేశారు.

☛ Ritika : పెళ్లి కోసం దాచిన నగలు అమ్మి చదివింది..కట్ చేస్తే ఆల్ ఇండియా ర్యాంకు..

తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ..

ఆ టీచర్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. ముదులి నీట్‌లో మంచి ర్యాంకు సాధించాడు. ఎంతో మంది డబ్బున్న వారి బిడ్డలు, లక్షలకు లక్షలు పోసి.. కోచింగ్‌లు తీసుకొని కూడా సాధించలేని మెడికల్‌ సీటును... ఈ అడవి బిడ్డ సాధించాడు. బెర్హంపూర్‌లోని మహారాజ కృష్ణచంద్ర గజపతి మెడికల్‌ కాలేజీలో చేరాడు. నాలుగేళ్లు ఇదే కసితో చదివేస్తే.. డాక్టర్‌ ముదులి అయిపోతాడు. 

సరైన వైద్యం అందక ఎన్నో...

బోండా తెగ నుంచి డాక్టర్‌ కాబోతున్న మొట్టమొదటి వ్యక్తి మంగళ ముదులినే. తన గూడెంలోని వారికి సరైన వైద్యం అందక ఎన్నో ఇబ్బందులు పడ్డారని, మూలికల వైద్యం, ఆకు పసరు లాంటి వాటితో సొంత వైద్యం చేసుకునే వారని, కొన్ని సార్లు అవి వికటించి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ముదులి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులే తనలో కసి పెంచాయని, తమ జీవితాలు మార్చుకోవాలంటే చదువు అనే ఆయుధాన్ని తాను నమ్ముకున్నట్లు ముదులి వెల్లడించాడు. 

☛ Inspirational Success Story : ఇలాంటి నాన్న కూడా ఉంటారా..?

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి శాఖ..
తన జాతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసమే తాను డాక్టర్‌ అవ్వాలనుకున్నట్లు.. ముదులి తెలిపాడు. సాధించాలనే పట్టుదల, అందుకు తగ్గ కృషి ఉంటే.. ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు మంగళ ముదులి. నేటి యువ‌త‌కు మంగళ ముదులి స‌క్సెస్ స్టోరీ ఎంతో స్ఫూర్తిధాయ‌కం.
అలాగే ఈ విషయాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి శాఖ ఎక్స్‌ ఖాతా వేదికగా కూడా తెలిపింది.

వీళ్ల‌కు సరైన వైద్యం అందక చాలా మంది ప్రాణాలు సైతం..

అడవి బిడ్డలు చాలా అమాయకంగా ఉంటారు.. జ్వరమొస్తే ఆకు పసరు మింగేస్తారు.. పెద్ద రోగం వస్తే ప్రాణాలు విడుస్తారు.. గర్భిణికి నొప్పులొచ్చినా, పిల్లలకి విషజ్వరమొచ్చినా, పెద్దలకు గుండెపోటు వచ్చినా.. అంబులెన్స్‌ వాళ్ల చెంతకు రాదు.. పెద్దాస్పత్రికి పోయే స్థోమత వాళ్లకు ఉండదు.. ఒక వేళ దగ్గరల్లోని సర్కారు దవఖానాకు వెళ్లాలంటే.. కర్రకు జోలె కట్టి తీసుకెళ్లాలి.. కొండలు కొనలు, వాగులు వంకలు దాటితే కానీ.. ప్రథమ చికిత్స కూడా అందదు. అలాంటి పరిస్థితుల్లో ఎంతో మంది అడవి బిడ్డలు ప్రాణాలు కోల్పోతున్నారు. సరైన వైద్యం అందక చిన్న జ్వరం కూడా తీవ్రమై విష జ్వరంగా ఊపిరి ఆపేస్తున్నారు. 

☛ NEET Ranker Success Story : ఓటమిని ఏనాడు ఒప్పుకోలేదు.. ఆర్థిక పరిస్థితులు ఘోరంగా ఉన్నా.. ఈ క‌సితోనే నీట్‌లో ర్యాంక్ కొట్టానిలా.. కానీ..

ఇలాంటి దారుణ పరిస్థితుల, ఎన్నో చావులు చూస్తూ పెరిగిన ఓ కుర్రాడు... తన జాతి తలరాతను మార్చేందుకు చదువును నమ్ముకున్నాడు. కొన్ని లక్షల మంది పోటీ పడే నీట్‌ పరీక్షలో పాసై.. ఎంబీబీఎస్‌ సీటు సాధించి.. ఓ గిరిజన తెగ నుంచి తొలి డాక్టర్‌ కాబోతున్నన్నాడు మంగళ ముదులి. కొన్ని తరాల పాటు యువతలో స్ఫూర్తి రగిల్చే..ఈ  19 ఏళ్ల ఆదివాసీ మంగళ ముదులికే ఈ ఘ‌న‌త ద‌క్కుతుంది.

 Inspirational Story: ‘జై భీమ్‌’ సినిమా సీన్‌ను రీపిట్‌ చేసిన గిరిజన యువతి..ఎలా అంటే..?

#Tags