సమాజ సేవ చేస్తా..: మృణాల్ కుట్టేరి
నేను కెమికల్ ఇంజనీరింగ్ చేయాలనుకున్నప్పటికీ.. సమాజానికి ఎక్కువ సేవ చేసేందుకు వైద్య రంగమైతే బాగుంటుందని ఎంబీబీఎస్‌ను ఎంచుకున్నా. వైద్య రంగం ఎంతో ఆసక్తికరమైందే కాకుండా సవాళ్లతోనూ కూడుకున్నది. ఎన్ సీఈఆర్‌టీ పుస్తకాలు బాగా అధ్యయనం చేశా. ఏకధాటిగా చదవడం కంటే ప్రతి 45 నిమిషాలకు 10– 15 నిమిషాల విరామమిచ్చేవాడిని. టీవీ చూడటం, వీడియోగేమ్స్ వంటి వాటితో ఒత్తిడిని జయించాను. అమ్మ.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా, నాన్న హెచ్‌ఆర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. వారిద్దరూ నన్ను అన్ని విధాల ప్రోత్సహించారు.
– మృణాల్ కుట్టేరి, నీట్, ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్
#Tags