టీచర్‌గా మారిన కలెక్టర్
సాక్షి, భామిని: ఎప్పుడు అధికారిక కార్యక్రమాలతో బిజీబిజీగా ఉండే కలెక్టర్ జె.నివాస్ మార్చి 18వ తేదీన కాసేపు ఉపాధ్యాయుని అవతారమెత్తారు.
సుద్దముక్క చేతపట్టుకుని తరగతి గదిలో పాఠాలు బోధించారు. విద్యార్థులకు ప్రశ్నలు వేసి వారి ప్రగతిని తెలుసుకున్నారు. భామిని మండలం బత్తిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన సందర్భంగా కలెక్టర్ 8వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించారు. అనంతరం మధ్యాహ్న భోజనం పదార్థాలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నారులు విద్యాకానుకలో భాగంగా అందజేసిన బూట్లను తప్పనిసరిగా వేసుకునేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు.