నవంబర్ 6 నుంచి డిగ్రీ బ్యాక్‌లాగ్ పరీక్షలు
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల బ్యాక్‌లాగ్ పరీక్షలు ఈనెల 6 నుంచి, ఎంబీఏ సెమిస్టర్ పరీక్షలు 10వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ. శ్రీరామ్ వెంకటేష్ సోమవారం తెలిపారు.
పూర్తి వివరాలను ouexams.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని పేర్కొన్నారు. ఇటీవల నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా యూనివర్శిటీ పరిధిలోని డిగ్రీ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.