ఇన్‌సర్వీస్ అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు సమర్పించే గడువు అక్టోబర్ 5వరకు పొడిగింపు
సాక్షి, అమరావతి: ప్రభుత్వంలో ఇప్పటికే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తూ సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న ఇన్ సర్వీస్ అభ్యర్థులు తమ వెయిటేజ్ మార్కుల కోసం ధ్రువీకరణ పత్రాలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సిన గడువును పొడిగించిన్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు.
దరఖాస్తు చేసుకున్న వారు వెయిటేజ్ మార్కులు పొందాలంటే గ్రామ, వార్డు సచివాలయ వెబ్‌సైట్ నుంచి ధ్రువపత్రాన్ని తీసుకుని, వారి వారి శాఖాధిపతులతో దానిపై ధ్రువీకరణ చేయించుకొని ఆ పత్రాలను అక్టోబర్ 5 సాయంత్రం 6 గంటలలోగా అప్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.