అంగన్‌వాడీలకు త్వరలో వేతనాల పెంపు.. యూనిఫాం కింద చేనేత చీరలు : మంత్రి సత్యవతి

వెంగళరావునగర్: అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు త్వరలోనే వేతనాలు పెంచనున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు.
అంగన్‌వాడీ వర్కర్లుగా ఉన్న హోదాను టీచర్లు, హెల్పర్లస్థాయికి పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. సీఎం మరోమారు వేతనపెంపు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. సోమ వారం రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ డెరైక్టరేట్‌లో అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు మంత్రి చీరలు అందజేశారు. కరోనా పోరులో ముందుండి సేవలందించినందుకు ప్రోత్సాహకంగా ఈ చీరలను అం దిస్తోందని వెల్లడించారు. ప్రతి అంగన్‌వాడీ టీచర్, వర్కర్‌కు త్వరలోనే చేనేత చీరలను యూనిఫాం కింద పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీలకు బీమా కల్పించాలని యోచిస్తున్నట్లు చెప్పారు.