ఎంబీబీఎస్ డాక్టర్ల పోస్టులకు 1,870 దరఖాస్తులు

సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎంబీబీఎస్ డాక్టర్ల నియామకాలకు ఇప్పటి వరకు 1,870 దరఖాస్తులు వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.
మొత్తం 1,190 పోస్టులకు నియామక నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తులు వైద్యవిద్యా సంచాలకుల కార్యాలయంలో పరిశీలన (స్క్రూటినీ) చేస్తున్నారు. వారం రోజుల్లోగా నియామక ప్రక్రియ పూర్తి చేసే అవకాశముంది. ఈ సమయంలో పనిచేసిన వారికి రెగ్యులర్ నియామకాల్లో 15 శాతం వెయిటేజీ ఇవ్వనున్నట్టు సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే.