బీపీటీ, బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్ కోర్సుల ప్రవేశానికి2021 నోటిఫికేషన్

లబ్బీపేట(విజయవాడతూర్పు) : డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి గాను బీఎస్సీ (నర్సింగ్) నాలుగేళ్ల డిగ్రీ కోర్సు, బీపీటీ(ఫిజియోథెరపీ), బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ, పోస్ట్ బేసిక్ బీఎస్సీ(నర్సింగ్) రెండేళ్ల డిప్లమో కోర్సుల్లో అడ్మిషన్లకు గాను బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది.
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీబీపీటీ, బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశానికివిడుదల చేసిన 2021 నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

ఆయా కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు గురువారం సాయంత్రం 4 గంటల నుంచి ఫిబ్రవరి ఐదో తేదీ సాయంత్రం 4 గంటల వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.