Free Coaching: పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎక్క‌డంటే..

పదో తరగతి వార్షిక పరీక్షల తర్వాత ఉన్నత విద్య కోసం జరిగే సెట్‌ పరీక్షలకు అభయ పౌండేషన్‌, నిస్వార్థ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈఓ నాగరాజు తెలిపారు.

ఆర్డీటీ సెట్‌, పాలీసెట్‌, ఏపీఆర్‌జేసీ, ఏపీఎంజేపీ, ఏపీఎస్‌డబ్ల్యూజేసీ, పుట్టపర్తి శ్రీసత్యసాయి కళాశాలల ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను డిసెంబ‌ర్ 26(మంగళవారం)న‌ డిప్యూటీ డీఈఓలు శ్రీనివాసరావు, శ్రీదేవి, బైజూస్‌ ట్యాబ్‌ల జిల్లా నోడల్‌ అధికారి ఓబుళరెడ్డి తదితరులతో కలసి ఆయన విడుదల చేసి మాట్లాడారు.

అభయ, నిస్వార్థ ఫౌండేషన్‌ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రభుత్వ, జెడ్పీ, ఏపీఎంఎస్‌, మునిసిపల్‌, కేజీబీవీ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతిభ ఆధారంగా అనంతపురం జిల్లాలో 30 మంది, శ్రీ సత్యసాయి జిల్లాలో 30 మందిని ఎంపిక చేయనున్నట్లు వివరించారు. ఎంపికై న వారికి ఉచిత వసతి, భోజన సదుపాయం ఉంటుందన్నారు. స్టడీ మెటీరియల్‌ ఉచితంగా అందజేస్తామన్నారు. శిక్షణతో పాటు క్రమశిక్షణ, విలువలు, ఆరోగ్యం, యోగా, ఆటలు, క్షేత్రపర్యటనలు, కర్మయోగ, నిజ జీవిత విజయగాథలపై అవగాహన కల్పిస్తామన్నారు.

Free Coaching for Group II: గ్రూప్‌–2 ఉచిత శిక్షణ దరఖాస్తుకు చివ‌రి తేదీ ఇదే..

#Tags