Job opportunities: జాబ్‌మేళాతో ఉద్యోగ అవకాశాలు..

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని నిరుద్యోగులకు శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గుణశేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఉపాధి కల్పనా కార్యాలయంలో సీడప్‌, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పనా శాఖ, డీఆర్‌డీఏ శాఖలు సంయుక్తంగా ఉద్యోగ మేళా నిర్వహించారు.
Job opportunities

ఆయన మాట్లాడుతూ ఉద్యోగ మేళాలో 4 బహుళజాతి కంపెనీలు పాల్గొన్నట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 57 మంది నిరుద్యోగులు మేళాలో పాల్గొనగా 22 మంది ఉద్యోగాలకు ఎంపికై నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మజ, అదనపు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఏకాంబరం, ఐటీఐ ప్లేస్‌మెంట్‌ అధికారి మురళీకృష్ణ, తదితర అధికారులు పాల్గొన్నారు.

Govt Scholarships: ఈ పథకానికి ఎంపికైతే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 50వేలు..

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags