Job Mela: జాబ్‌మేళాకు విశేష స్పందన..
కురుమద్దాలి (పామర్రు): మండలంలోని కురుమద్దాలిలో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఈ మేళాలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 260 మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, డీఆర్డీఏ సీడాఫ్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రామంలోని కొసరాజు పూర్ణచంద్రరావు కమ్యూనిటీ హాల్‌లోని రూరల్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో జాబ్‌మేళాను నిర్వహించారు.
ఈ జాబ్‌మేళాలో టెక్నో టాస్క్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, డీ మార్ట్, ఇన్నోవ్ సోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, నవతా రోడ్ ట్రాన్స్‌పోర్టు వంటి ఐదు ప్రముఖ కంపెనీల వారు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్యూలను నిర్వహించారు.
Software Jobs: ఐటీ కంపెనీలో ఉద్యోగాలు.. రూ. 5లక్షల ప్యాకేజీ, ఇంటర్వ్యూ తేదీ ఇదే
వీరిలో 58 మంది ఉద్యోగాలకు ఎంపిక కాగా, మరో 45 మందికి ఫైనల్ కావాల్సి ఉంది. ఉద్యోగాలు పొందిన వారికి స్థానిక ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా నియామక ఉత్తర్వులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్‌బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ పి.నరుష్‌కుమార్, స్థానిక నాయకులు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags