IT Hub in AP: ఐటీ హబ్‌గా విశాఖ అభివృద్ధి

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఐటీ హబ్‌గా విశాఖపట్నం అభివృద్ధి చెందుతోందని టీటీడీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో–ఆర్టినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎడ్జ్‌ఫ్లెక్స్‌ అండ్‌ నాలెడ్జి హట్‌ అప్‌గ్రాడ్‌ సంస్థ స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగే గ్రూవ్‌ స్నాప్‌ ఫెస్ట్‌ జాబ్‌మేళాను ఆయన శుక్రవారం ప్రారంభించారు.
IT Hub in andhra pradesh visakapatnam

ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పించేలా ఇటువంటి జాబ్‌మేళాలు దోహదపడతాయన్నారు. ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఈ మేళాలో పాల్గొని నిరుద్యోగులకు శిక్షణ, ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పిస్తాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ నగరాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగా ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ తన కార్యకలాపాలను ప్రారంభించడానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఐటీ రంగానికి ఉపయోగపడేలా దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా అదానీ డేటా సెంటర్‌ ఏర్పాటుకు భూమి పూజ చేసినట్టు గుర్తు చేశారు.

Good News: 28న మెగా జాబ్‌ మేళా

అనంతరం ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు, నిరుద్యోగులకు రూ.20 లక్షల విలువైన స్కాలర్‌షిప్‌లు అందజేశారు. జాబ్‌మేళాలో పాల్గొన్న 20కి పైగా కంపెనీలు 500 మందికి ఉద్యోగాలు కల్పించారు.

#Tags