Free Skill Training: ఈ కోర్సుల్లో నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ!
గుంటూరు ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు చేతివృత్తుల్లో ఉచిత నైపుణ్య శిక్షణ కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉన్న ప్రభుత్వ ఐటీఐ–జిల్లాస్థాయి శిక్షణ సంస్థ ప్రిన్సిపాల్ బి.సాయివరప్రసాద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
Guest Lecturer Jobs: గెస్ట్ లెక్చరర్ పోస్టులకు ఆహ్వానం
అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, ఎంఎస్ ఆఫీస్ (డేటా ఎంట్రీ ఆపరేటర్) కోర్సుల్లో టెన్త్, ఆపైన విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు ఈనెల 15 నుంచి ఉచిత శిక్షణ ప్రారంభిస్తున్నట్లు వివరించారు. మూడు నెలల ఉచిత శిక్షణతోపాటు పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా సంస్థ కార్యాలయంతో పాటు శిక్షణాధికారి పవన్‌కుమార్ (8333973929), ప్రిన్సిపాల్ (7386885639)ను సెల్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
396 Jobs: భవిత రీసోర్స్ పర్సన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి