Anganwadi Jobs in AP: దరఖాస్తుకు చివరి తేదీ ఇదే... ఎక్కడంటే?

ఐసీడీఎస్‌లో అంగన్‌వాడీ కార్యకర్తలతో పాటు ఆయాల నియామకానికి భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.

నంద్యాల(అర్బన్‌): జిల్లాలోని ఆరు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న మెయిన్‌, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలతో పాటు ఆయాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సీ్త్ర, శిశు అభివృద్ధి సాధికారత అధికారిణి నిర్మల తెలిపారు.

Andhra Pradesh : అంగన్‌వాడీ వర్కర్లకు అడగకుండానే.. వరాలు..

ఏడు మెయిన్‌ అంగన్‌వాడీ కార్యకర్తలు, రెండు మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, 34 ఆయాల నియామకానికి దరఖాస్తులు కోరుతున్నామన్నారు. స్థానిక కార్యాలయంలో మంగళవారం ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్త పోస్టుకు పదవ తరగతి పాసై, ఈ నెల 1వ తేదీకి 21 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు.

పెళ్లి అయి అదే గ్రామంలో నివాసం ఉన్న వారు అర్హులని, నియామకంలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించబడుతుందన్నారు. దరఖాస్తు వెంట ధ్రువపత్రాల జిరాక్స్‌ కాపీలను (సెల్ఫ్‌ అటెన్షన్‌ చేయవలెను) జత పరిచి సంబంధిత సీడీపీఓ కార్యాలయాల్లో ఈనెల 18 నుంచి 22వ తేదీ సాయంత్రంలోగా అందజేయాలన్నారు.

250 posts in Vizag Steel Plant: ఈ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలు .. ఎంపిక విధానం ఇలా‌..

ఖాళీల వివరాలకు సంబంధించి సంబంధిత సీపీడీఓ కార్యాలయాల్లో సంప్రదించాని, పూర్తి వివరాలకు http//:nandyal.ap. gov.inలో పరిశీలించాలన్నారు.

ప్రాజెక్టు అసిస్టెంట్‌ పోస్టుకు..

ఐసీడీఎస్‌ బలోపేతం చేసి పోషణ స్థాయిని మెరుగు పరిచే ప్రాజెక్టు ఎస్‌ఎస్‌ఎం/పోషణ్‌ అభియాన్‌ జిల్లా స్థాయిలో ఖాళీగా ఉన్న ప్రాజెక్టు అసిస్టెంట్‌ పోస్టుకు కాంట్రాక్ట్‌ పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీడీ నిర్మల తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 19 నుంచి 25వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తులు సంబంఽధిత కార్యాలయంలో అందించాలన్నారు.

AP Faculty Jobs 2023: 590 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

#Tags