Jee Advanced 2023: పరీక్ష తేదీ ఇదే.. ఈ ర్యాంకుల ఆధారంగానే ఐఐటీలలో ప్రవేశాలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి జూన్‌ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జరగనుంది. ఐఐటీ గౌహతి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసింది.
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తేదీ ఇదే.. ఈ ర్యాంకుల ఆధారంగానే ఐఐటీలలో ప్రవేశాలు

ఇప్పటికే హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు ఆప్షన్లు కూడా ఇచ్చింది. గత నెలలో జేఈఈ మెయిన్స్‌ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు దాదాపు 11 లక్షల మంది దేశవ్యాప్తంగా హాజరయ్యారు. వారిలో 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేశారు.

చదవండి: జేఈఈ (మెయిన్స్‌ & అడ్వాన్స్‌డ్‌) - గైడెన్స్ | న్యూస్ | వీడియోస్

ఏటా ఇదే విధంగా ఎంపిక చేస్తున్నా 1.50 లక్షల మంది మాత్రమే అడ్వాన్స్‌డ్‌కు వెళ్తున్నారు. అడ్వాన్స్‌డ్‌లో వచ్చే ర్యాంకుల ఆధారంగానే ఐఐటీలలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారు. పరీక్ష మొత్తం ఆన్‌లైన్‌ విధానంలోనే జరుగుతుంది.

#Tags