JEE (Mains)2024: జేఈఈ మెయిన్స్ 2024 లో మెరిసిన విద్యార్థులు
కర్నలు : జాతీయ స్థాయిలో పేరొందిన విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించేందుకు నిర్వహింన జేఈఈ మెయిన్ సెషన్– 2 పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజేన్సీ బుధవారం అర్ధరాత్రి ప్రకటింంది. ఈ ఫలితాలలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. జేఈఈ మెయిన్ మొదటి సెషన్ పరీక్షలు ఈ ఏడాది జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు నిర్వహించగా 2,568 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఫలితాలు ఫిబ్రవరి 13వ తేదిన వచ్చాయి. రెండో సెషన్ పరీక్షలు ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు జరిగాయి. మొదటి, రెండో సెషన్స్‌లలో జరిగిన పరీక్షలకు హాజరైన వారి మార్కులలో ఎక్కువ మార్కులు వచ్చిన వాటిని తీసుకొని పర్సెంటెల్‌ను లెక్కించి ర్యాంకులు ప్రకటించారు. ఇందులో జిల్లాకు చెందిన విద్యార్థులు ఉత్తమ పర్సెంటెల్ సాధించారు. సయ్యద్ అలీఖాన్ 99.932, వేద వ్యాస 99.918, జ్యోతిరాదిత్య 99.913, కోడూరు తేజేశ్వర్ 99.901, పి.ప్రణీత్‌రెడ్డి 99.774, ఎస్.సాఖిత సాయి మణికంఠ 99.715, సాఖిత రాము 99.621, డి.నోయల్ తన్యా 98.966, ప్రతాప్ ఉవ లిఖిస్ 98.75లతో పాటు మరికొంత మంది ఉత్తమ పర్సెంటెల్ సాధించారు.
Also Read: JEE Mains 1st Ranker Nilkrishna Success Story
27 నుంచి అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు :
జేఈఈ మెయిన్‌లో కటాఫ్ మార్కుల సాధింన విద్యార్థులకు అడ్వాన్డŠస్ పరీక్షలు రాసేందుకు అవకాశం కలుగుతుంది. ఈ పరీక్షకు ఈ నెల 27 నుం మే నెల 7వ తేది వరకు ఐఐటీ మద్రాసు దర ఖాస్తులను స్వీకరించనుంది. మే 17 నుంచి 26 వరకు అడ్వాన్డ్స్ పరీక్షల అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయి. మే 26 నుంచి ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1 , మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్–2 పరీక్ష నిర్వహించను న్నారు. ఫలితాలను జూన్ 9న ప్రకటించనున్నారు.
సత్తా చాటిన గురుకుల విద్యార్థులు
కల్లూరు: మండల పరిధిలోని న్నటేకూరులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల ఐఐటీ–నీట్ అకాడమీ విద్యార్థులు జెఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. ఈ అకాడమిలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన గ్రామీణ విద్యార్థులు ఇంటర్మీడియట్‌తో పాటు ఐఐటీ–నీట్ పరీక్షలకు శిక్షణ పొందుతున్నారు. ఈ ఏడాది 76 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 73 మంది విద్యార్థులు ఎన్‌టిఎ వారు నిర్వహింన జాతీయ స్థాయి జెఈఈ మెయిన్స్ పరీక్ష ఉత్తీర్ణత సాధించి జెఈఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించినట్లు అకాడమీ డైరెక్టర్ డి.రామసుబ్బారెడ్డి గురువారం విలేకరులకు తెలిపారు. 14 మంది విద్యార్థులు 90 పర్సెంటైల్ పైన సాధించారు.
విద్యార్థి పేరు: వి.సంతోష్,
పర్సెంటైల్: 98.75, జాతీయ స్థాయిలో
క్యాటగిరీ ర్యాంక్–499
తల్లిదండ్రులు: వెంకట రమణ, అరుణ,
స్వస్థలం: మదనపల్లె, అన్నమయ్య జిల్లా,
లక్ష్యం: ముంబాయి ఐఐటీలో చదవడం
విద్యార్థి పేరు: ఎం. అభిషేక్
పర్సెంటైల్: 96.12, జాతీయ స్థాయిలో క్యాటగిరీ ర్యాంక్–2033
తల్లిదండ్రులు: అమోస్, దేవమ్మ
స్వస్థలం: సోమల గూడూరు,
నందవరం మండలం, కర్నూలు
లక్ష్యం: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
విద్యార్థి పేరు: బి. గురు ప్రసాద్
పర్సెంటైల్: 97.71, జాతీయ స్థాయిలో
క్యాటగిరీ ర్యాంక్–1007
తల్లిదండ్రులు: వాసుదేవయ్య, సరస్వతి
స్వస్థలం: మదనపల్లె, అన్నమయ్య జిల్లా
లక్ష్యం: ముంబాయి ఐఐటీలో చదవడం
విద్యార్థి పేరు: ఎన్.నరేంద్ర
పర్సెంటైల్: 96.71, జాతీయ స్థాయిలో క్యాటగిరీ ర్యాంక్–1638
తల్లిదండ్రులు: ఎల్లయ్య, మహేశ్వరి
స్వస్థలం: రత్నపల్లె, వెల్దుర్తి మండలం, కర్నూలు జిల్లా
లక్ష్యం: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావడం
విద్యార్థి పేరు: ఎస్.ఆదరణకుమార్
పర్సెంటైల్: 95.09, జాతీయ స్థాయిలో క్యాటగిరీ ర్యాంక్: 2752
తల్లిదండ్రులు: యేసు, సంతోషమ్మ
స్వస్థలం: కొత్తకోట, సీ.బెళగల్ మండలం,
కర్నూలు లక్ష్యం: ఐఐటీ బొంబాయిలో చదవడం