గ్లోబల్ మైండ్‌సెట్‌ను అలవర్చుకోవాలి
దేశంలో ఎంబీఏ, ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో సమూల మార్పులు తేవాల్సిన అవసరం ఎంతో ఉంది. విద్యార్థులు దేశ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటూనే.. గ్లోబల్ మైండ్‌సెట్‌ను అలవర్చుకోవాలి. అప్పుడే అంతర్జాతీయ స్థాయి పోటీని దీటుగా ఎదుర్కోవడానికి వీలవుతుంది అంటున్నారు గ్రేట్ లేక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ బాల వి.బాలచంద్రన్. అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగంలో దశాబ్దాల టీచింగ్ అనుభవం ఉన్న ఆయన ప్రపంచ ప్రఖ్యాత కెల్లాగ్స్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో అకౌంటింగ్ రీసెర్చ్ సెంటర్ డెరైక్టర్ వంటి ఉన్నత హోదా సొంతం చేసుకున్నారు. ఇంకా ఐఎస్‌బీ-హైదరాబాద్ ఏర్పాటులో, ఎండీఐ-గుర్గావ్‌లో ఎంబీఏ రూపకల్పనలో కీలక పాత్ర పోషించి పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన ప్రొఫెసర్ బాల వి.బాలచంద్రన్‌తో మేనేజ్‌మెంట్ విద్యపై ప్రత్యేక ఇంటర్వ్యూ...
ఫ్యాకల్టీ కొరత తీరితేనే పరిష్కారం
మేనేజ్‌మెంట్ కోర్సులు, బి-స్కూల్స్ విషయంలో దేశం ముందంజలో నిలుస్తోందనేది నిస్సందేహం. ఐఐఎంలు, ఐఎస్‌బీ వంటి ఎన్నో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లు దేశంలో ఉన్నాయి. విద్యార్థుల్లోనూ చక్కటి ప్రతిభ కనిపిస్తోంది. వారు ఎంఐటీ, హార్వర్డ్, కెల్లాగ్, స్టాన్‌ఫోర్డ్ వంటి ప్రఖ్యాత యూనివర్సిటీల విద్యార్థులతో పోటీ పడేలా నైపుణ్యాలు సొంతం చేసుకుంటున్నారు. కానీ ఇప్పటికీ వేధిస్తున్న సమస్య ఫ్యాకల్టీ కొరత. బి-స్కూల్స్‌లో ఆశించిన స్థాయిలో, అవసరాలకు తగిన రీతిలో ఫ్యాకల్టీ సంఖ్య లేదు. ఫ్యాకల్టీ కొరతకు అరకొర ఆర్థిక ప్రోత్సాహకాలే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. రీసెర్చ్ ఇన్సెంటివ్స్ వంటివి కూడా పెద్దగా ఉండవు. దాంతో నిపుణులు ఇతర దేశాలకు వెళ్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పరిష్కార మార్గాలు అన్వేషించాలి.
మంచి ఫ్యాకల్టీ ఉంటే మరెన్నో లాభాలు
ఫ్యాకల్టీకి ప్రోత్సాహకాలు అందిస్తే బహుళ ప్రయోజనాలు చేకూరుతాయి. విద్యార్థులకు, సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంతోపాటు క్వాలిటీ రీసెర్చ్, పేపర్స్ పబ్లికేషన్స్‌పట్ల ఉత్సాహం చూపుతారు. వాస్తవానికి విద్యార్థులకు నాణ్యమైన కోర్సులు అందించే దిశగా ఇన్‌స్టిట్యూట్‌లకు ఇవి ఎంతో ముఖ్యమైనవి. అన్నిటికీ మించి సామాజిక అవసరాలూ విస్తృత స్థాయిలో నెరవేరుతాయి.
గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్స్‌తో పోటీ పడాలంటే
మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్ కోర్సు ఏదైనా.. ఒక ఇన్‌స్టిట్యూట్ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలంటే మూడు ముఖ్య అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. అవి బెస్ట్ స్టూడెంట్స్, బెస్ట్ ఫ్యాకల్టీ, క్వాలిటీ కరిక్యులం. ఈ అంశాల్లో కొన్ని లోపాల కారణంగానే మన ఇన్‌స్టిట్యూట్‌లు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోలేకపోతున్నాయి. ఐఐఎంలు తదితర ప్రముఖ విద్యా సంస్థలు మంచి ఇన్‌స్టిట్యూట్‌లుగానే పేరు పొందుతున్నాయి. కానీ గ్లోబల్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా ఉండట్లేదు.
కరిక్యులం.. సొంత శైలిలో
ప్రస్తుతం దేశంలోని బి-స్కూల్స్‌లో కోర్సుల కరిక్యులంలో ఎన్నో మార్పులు తీసుకురావాల్సిన అవసరముంది. ఆధునిక యుగంలోనూ అనేక ఇన్‌స్టిట్యూట్‌లు ‘కాపీ-పేస్ట్’ విధానంలో కరిక్యులంను రూపొందిస్తున్నాయి. పాశ్చాత్య దేశాల్లోని పేరున్న కళాశాలల కరిక్యులంను యథాతథంగా అనుసరించడం మంచిది కాదు. దీనివల్ల ఎన్నో ప్రతికూలతలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మన అవసరాలకు తగ్గట్టు సొంత శైలిలో మేనేజ్‌మెంట్ కరిక్యులం రూపకల్పన జరగాలి. మనకు మూడు వేల ఏళ్ల చరిత్ర గల అకడమిక్ వారసత్వం ఉంది. ఇదే మన సొంత శైలిలో కరిక్యులం రూపకల్పనకు చక్కటి మార్గ నిర్దేశకంగా నిలుస్తోంది.
సొల్యూషన్ ఓరియెంటేషన్ కావాలి
మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రస్తుతం అధిక శాతం థియరిటికల్ అప్రోచ్ లేదా ప్రాబ్లమ్ ఓరియెంటేషన్‌తో ఉంటున్నాయి. సమస్యకు కారణాలు తెలుస్తున్నాయి కానీ పరిష్కార మార్గాలు తెలియట్లేదు. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది సొల్యూషన్ ఓరియెంటెడ్ లెర్నింగ్. పాశ్చాత్య దేశాల్లో అనుసరిస్తున్న విధానం ఇదే. అక్కడ ప్రాబ్లమ్‌తోపాటు సదరు సమస్య పరిష్కార మార్గాలపైనా అవగాహన లభించేలా బోధన, కరిక్యులం ఉంటుంది. అలాంటి విధానమే మన దేశ పరిస్థితులు, స్థానిక అవసరాలకు తగ్గట్టు రూపొందించి అమలుచేయాలి. ఈ విషయంలో విద్యార్థులు సైతం చొరవతో స్వీయ అభ్యసన శైలిని అలవర్చుకోవాలి. ఇంటర్నెట్ యుగంలో గూగుల్, వికీపీడియా వంటి ఎన్నో మాధ్యమాల ద్వారా నాణ్యమైన సమాచారం లభిస్తోంది. దీన్ని అందిపుచ్చుకుంటే అకడమిక్‌గా మరింత నైపుణ్యం లభిస్తుంది.
ప్రయోజనం చేకూర్చే లీడర్‌షిప్ ప్రోగ్రామ్స్
ప్రొఫెషనల్ విద్యార్థుల్లో స్కిల్స్ విషయంలో ప్రయోజనం చేకూర్చేవి లీడర్‌షిప్, టాలెంట్ ప్రోగ్రామ్స్. ఇందుకోసం ఇండస్ట్రీలు, అకడమిక్ ఇన్‌సిట్యూట్‌లు భాగస్వాములు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే మన దేశంలో టాటా గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్ తదితర ప్రముఖ కార్పొరేట్ సంస్థలు వీటి ఆవశ్యకతను గుర్తించి విద్యా సంస్థలతో ఒప్పందాల ద్వారా లీడర్‌షిప్, టాలెంట్ ప్రోగ్రామ్స్‌ను నిర్వహిస్తున్నాయి. ఇవి మరింత విస్తృతం కావాలి.
దీర్ఘకాలిక వ్యూహంతో వ్యవహరించాలి
ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరిన విద్యార్థుల అంతిమ లక్ష్యం చక్కటి ఉద్యోగం. ఆకర్షణీయమైన వేతనాలు పొందడం. దీన్ని ఎవరూ కాదనలేరు. కానీ కేవలం ఉద్యోగ కోణానికే కెరీర్ ఆలోచనను పరిమితం చేసుకోకూడదు. అకడమిక్ ఎక్స్‌లెన్స్‌కు కాల పరిమితి లేదని గుర్తించాలి. అందుకోసం నిత్య నూతనంగా వ్యవహరించాలి. నిరంతరం అప్‌డేట్ అవుతుండాలి. స్కిల్ సెట్ విషయంలో ఇతరుల కంటే ముందుండేలా పోటీతత్వాన్ని సైతం అలవర్చుకోవాలి.
మంచి మేనేజర్‌గా ఎదగాలంటే
మేనేజ్‌మెంట్ విద్యార్థులకు అకడమిక్, కెరీర్ పరంగా తప్పనిసరిగా అవసరమైన స్కిల్స్ రెండు. అవి.. ఇన్నోవేషన్, క్రియేటివిటీ. బ్లాక్ అండ్ వైట్ అప్రోచ్ నుంచి బయటపడాలి. ఒక అంశంలోని సానుకూల, ప్రతికూల అంశాలను, వివిధ మార్గాలను గుర్తించే విధంగా ఆలోచన శైలిని మార్చుకోవాలి. అప్పుడు కచ్చితంగా మంచి మేనేజర్లుగా తమను తాము తీర్చిదిద్దుకోగలుగుతారు.