ఓపెన్ స్కూల్ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

సాక్షి, హైదరాబాద్: ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్స్ సొసైటీఈనెల 3నవిడుదల చేసింది.
ఏప్రిల్20 నుంచి 30 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు హాజరు కాగోరు విద్యార్ధులు పరీక్ష రుసుమును ఈ నెల10 నుంచి 23వ తేదీ లోపు చెల్లించాలని, రూ.25 ఆలస్య రుసుముతో మార్చి3వ తేదీలోగా, రూ.50 ఆలస్య రుసుముతో మార్చి 10వ తేదిలోగా చెల్లించాలని డెరైక్టర్ కె. రమణ శేషు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది విద్యార్థులు పేర్లను నమోదు చేసుకున్నారని, వీరిలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల నుంచే ఉన్నారని డెరైక్టర్ వివరించారు.
#Tags