జూన్ 12న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు జూన్ 12వ తేదీన విడుదల కానున్నాయి.
మధ్యాహ్నం 12 గంటలకు ఆంధ్రాయూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వీటిని విడుదల చేయనున్నారని ఇంటర్ బోర్డు ప్రజాసంబంధాల అధికారి సికిందర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
#Tags