Intermediate Examination: ఇంట‌ర్ విద్యార్థుల‌కు మ‌రో అవ‌కాశం

గ‌తేడాది, ఈ ఏడాదిలో ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థుల‌కు ప్ర‌భుత్వం ఒక మంచి అవ‌కాశాన్ని కల్పిస్తుంది. ఈ అవ‌కాశాన్ని ప్ర‌తీ విద్యార్థి వినియోగించుకోవాల‌ని తెలిపింది. అలాగే, వారి ప‌రీక్ష‌లు మ‌ళ్ళీ రాసే అవ‌కాశంపై వివ‌రాల‌ను తెలిపారు.
Inter students supplementary examination

సాక్షి ఎడ్యుకేష‌న్: ఈ ఏడాది ఫిబ్రవరి/మార్చి, గతే డాది మార్చి నెలల్లో జరిగిన ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఫెలైన విద్యార్థులు వచ్చే ఏడాది పరీక్షలు రాసేందుకు ఈ నెల 30వ తేదీలోపు ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారి గురవయ్యశెట్టి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

YSRCP Government Education Scheme: జ‌గ‌న్న ప్ర‌భుత్వం అమలు చేసిన‌ విద్యా సాయానికి ప‌థ‌కం

పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు మళ్లీ కాలేజీకి వచ్చి చదువుకుని పరీక్షలు రాసేందుకు ఇంటర్మీడియట్‌ బోర్డు అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఆయా ప్రాంతాల్లోని కాలేజీ ప్రిన్సిపాళ్లను సంప్రదించాలన్నారు.

#Tags