ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపునకు నవంబర్ 5 ఆఖరు

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నవంబరు 5లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా శాఖ కమిషనర్ బి.ఉదయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.
ఆలోగా చెల్లించకపోతే ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. రూ.126 ఆలస్య రుసుముతో నవంబర్ 14 వరకు, రూ.500తో నవంబర్ 26 వరకు, రూ.1000తో డిసెంబర్ 6 వరకు, రూ.2000తో డిసెంబరు 20 వరకు, రూ.3000తో డిసెంబర్ 30 వరకు, రూ.5000తో వచ్చే ఏడాది జనవరి 22 వరకు ఫీజు చెల్లించొచ్చు.
#Tags