ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి.
ఈ మేరకు విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు జనరల్, వొకేషనల్ కోర్సులకు సంబంధించిన అన్ని ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి. 1,445 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా 10,31,285 మంది హాజరయ్యారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 5,23,099 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 5,08,186 మంది ఉన్నారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి.
ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా 77 శాతంతో ప్రథమ స్థానంలో ఉంది
సెకండియర్ ఫలితాలో కృష్ణా జిల్లా 86 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచింది
రెండు సంవత్సరాల ఫలితాల్లో వైఎస్సార్ జిల్లా చివరి స్థానంలో ఉంది.
ఇంటర్ ఫస్టియర్‌లో బాలికలు 80 శాతం, బాలురు 75 శాతం ఉత్తీర్ణులయ్యారు.
ఇంటర్ సెకండియర్‌లో బాలికలు 69 శాతం, బాలురు 60 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
మే 15 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.

#Tags