Indian Polity Federal and Unitary Systems : గ్రూప్స్ పరీక్షలకు ప్రత్యేకం.. సమాఖ్య, ఏక కేంద్ర వ్యవస్థల మధ్య తేడాలు?

భారత సమాఖ్య వ్యవస్థ
కేంద్ర, రాష్ట్ర సంబంధాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాల ఆధారంగా రాజకీయ వ్యవస్థలను సమాఖ్య లేదా ఏక కేంద్ర ప్రభుత్వాలుగా వర్గీకరిస్తారు.
కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన ఉంటే సమాఖ్య వ్యవస్థగా, అధికారాలన్నీ ఒకే ప్రభుత్వంలో కేంద్రీకృతమై ఉంటే దాన్ని ఏక కేంద్ర ప్రభుత్వంగా పేర్కొంటారు.

సమాఖ్య వ్యవస్థ
సమాఖ్య అనే పదాన్ని ఆంగ్లంలో ‘ఫెడరేషన్‌’ అంటారు. ఈ పదం లాటిన్‌లోని ‘ఫోడస్‌’ అనే పదం నుంచి ఉద్భవించింది. ఫోడస్‌ అంటే ఒప్పందం లేదా అంగీకారం. సమాఖ్య ప్రభుత్వాలు సాధారణంగా కేంద్రం, రాష్ట్రాల మధ్య ఒప్పందం ద్వారా ఏర్పడతాయి.
సమాఖ్య వ్యవస్థకు ఉదాహరణలు: అమెరికా, కెనడా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, అర్జెంటీనా మొదలైనవి.

ఏక కేంద్ర వ్యవస్థ 
ఈ తరహా వ్యవస్థలో అధికారాలన్నీ ఒకే ప్రభుత్వంలో కేంద్రీకృతమై ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఉండవు. పరి΄ాలనా సౌలభ్యం కోసం ప్రాంతాలను కొన్ని యూనిట్లుగా విభజిస్తారు. వీటికి స్వతంత్ర ప్రతిపత్తి ఉండదు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి.
ఏక కేంద్ర వ్యవస్థకు ఉదాహరణలు: బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, చైనా, ఇటలీ, బెల్జియం మొదలైనవి.

Regular Based Jobs : ఆర్‌వీఎన్‌ఎల్‌లో రెగ్యుల‌ర్ ప్రాతిప‌దిక‌న వివిధ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

సమాఖ్య, ఏక కేంద్రాల మధ్య పోలికలు, తేడాలు
సమాఖ్య ప్రభుత్వం
     కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఉంటుంది.
     లిఖిత, దృఢ రాజ్యాంగం తప్పనిసరి
     ద్వంద్వ ప్రభుత్వాలు ఉంటాయి.
     కేంద్ర శాసనసభ ద్విసభా విధానాన్ని కలిగి ఉంటుంది.
     స్వతంత్ర సర్వోన్నత న్యాయవ్యవస్థ ఉంటుంది.
     రాజ్యాంగ ఆధిక్యత ఉంటుంది.

ఏక కేంద్ర ప్రభుత్వం
     అధికారం కేంద్రీకృతమై ఉంటుంది.
     ఏ తరహా రాజ్యాంగమైనా ఉండవచ్చు.
     కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఉంటుంది.
     ద్విసభా విధానం తప్పనిసరి కాదు.
     న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు.
     కేంద్ర ప్రభుత్వ ఆధిక్యత ఉంటుంది.

School Holidays: దంచికొడుతున్న వానలు.. స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్‌!

సమాఖ్య ఏర్పడే పద్ధతులు
సమాఖ్య సాధారణంగా రెండు పద్ధతుల ద్వారా ఏర్పాటవుతుంది.
రాష్ట్రాల కలయిక వల్ల ఏర్పడే సమాఖ్య (Federation by Integration):
ఈ తరహాలో, స్వతంత్రంగా ఉన్న రాష్ట్రాలు ఆర్థిక, రాజకీయ, సైనిక కారణాల వల్ల సమీకృతమై సమాఖ్యగా ఏర్పడతాయి. ఉదా: అమెరికాలోని రాష్ట్రాలన్నీ ఒక ఒప్పందం ద్వారా 1787లో అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనే సమాఖ్య రాజ్యంగా ఏర్పడ్డాయి. ఈ విధానాన్ని ’ఇౌఝ జీnజ ్టౌజ్ఛ్టజ్ఛిట’ పద్ధతి అంటారు.
విచ్ఛిత్తి ప్రక్రియ వల్ల ఏర్పడే సమాఖ్య (Feder-ation by Disintegration):
భౌగోళికంగా, జనాభాపరంగా పెద్ద దేశాలు పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని స్వతంత్ర ప్రతిపత్తిగల రాష్ట్రాలను ఏర్పాటు చేసి, వాటికి రాజ్యాంగపరంగా అధికారాలు బదలాయిస్తాయి.
ఉదా: 1867లో ఏక కేంద్రంగా ఉన్న కెనడా 10 కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసి సమాఖ్యగా అవతరించింది. ఈ విధానాన్ని 'Holding together' పద్ధతి అంటారు.

భారత సమాఖ్య – చరిత్ర
భారత సమాఖ్య చరిత్ర 1870లో లార్డ్‌ మేయో వికేంద్రీకరణ విధానంతో ప్రారంభమైందని చెప్పొచ్చు. భారత ప్రభుత్వ చట్టం–1919, దేశానికి నిజమైన సమాఖ్య లక్షణాన్ని ఇచ్చింది. భారత రాజ్యాంగం సమాఖ్య ప్రాతిపదికపై∙ఏర్పడాలని సైమన్‌ కమిషన్‌ ప్రతిపాదించింది. ఆ తర్వాత భారత ప్రభుత్వ చట్టం–1935, భావి భారత రాజ్యాంగానికి నిర్మాణాత్మకమైన సమాఖ్య రేఖాపటాన్ని ఇచ్చింది. అయితే, స్వదేశీ సంస్థానాలు వ్యతిరేకించడంతో ఇది అమల్లోకి రాలేదు. స్వాతంత్య్రానంతరం, రాజ్యాంగ పరిషత్‌ భారతదేశానికి సమాఖ్య వ్యవస్థనే ఎంచుకొని, దానికి అనుగుణంగానే రాజ్యాంగాన్ని రచించింది.

Asst Professor Jobs : ఏపీ వైద్య కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ ఉద్యోగాలు.. పోస్టుల వివ‌రాలు ఇలా..

ముఖ్య లక్షణాలు
ప్రపంచ సమాఖ్య వ్యవస్థలను పరిశీలిస్తే కింద పేర్కొన్న లక్షణాలుంటాయి.

అధికార విభజన:
అధికార విభజన సమాఖ్య ముఖ్య లక్షణం. రాజ్యాంగపరంగా కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఉంటుంది. ఈ విభజన ఎన్ని జాబితాల్లో ఉండాలనే అంశంపై సార్వత్రిక సమ్మతి లేదు. భారత రాజ్యాంగంలో అధికారాలను మూడు జాబితాలుగా విభజించారు. అమెరికాలో కేవలం ఒకే జాబితా, ఆస్ట్రేలియాలో మూడు జాబితాలున్నాయి.

లిఖిత రాజ్యాంగం
సమాఖ్య వ్యవస్థకు లిఖిత రాజ్యాంగం ఉండాలి. దీంతో కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన, పరిధి సృష్టంగా ఉంటాయి. లిఖిత రాజ్యాంగం ద్వారానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి పరిధుల్లోనే పనిచేసేలా నియంత్రణ వీలవుతుంది. భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగమే. 

సర్వోన్నత, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయవ్యవస్థ:
కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలు అంటే సమాఖ్య వివాదాలను పరిష్కరించడానికి దేశంలో ఒక అత్యున్నత న్యాయవ్యవస్థ ఉండాలి. అటువంటి న్యాయవ్యవస్థ రాజ్యాంగ ఆధిక్యతను కాపాడి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధుల్లోనే పనిచేసేలా చూస్తుంది. న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తి కోసం రాజ్యాంగంలో అనేక పరిరక్షణలు పొందుపర్చారు.

Two Days All Schools Holidays Due To Heavy Rain : బ్రేకింగ్ న్యూస్‌.. అత్యంత భారీ వ‌ర్షాలు.. 2 రోజులు స్కూల్స్‌కు సెల‌వులు.. ఇంకా..

ద్విసభా పద్ధతి
సమాఖ్యలో కేంద్ర శాసనసభ ద్విసభా పద్ధతిని కలిగి ఉంటుంది. ఎగువ సభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుతుంది. భారతదేశంలో రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అందుకే దీన్ని రాష్ట్రాల మండలి (Council of States) 
అంటారు.

రాజ్యాంగ ఆధిక్యత
సమాఖ్యలో రాజ్యాంగం అత్యున్నతమైన చట్టం. రాజ్యాంగమే అన్ని అధికారాలకు మూలం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడి పనిచేస్తాయి. ఒకవేళ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా చట్టాలు చేస్తే, అవి చెల్లుబాటు కాకుండా న్యాయ సమీక్షాధికారం ద్వారా సుప్రీంకోర్టు కొట్టివేస్తుంది.

దృఢ రాజ్యాంగం
సమాఖ్య వ్యవస్థకు దృఢ రాజ్యాంగం ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాల కోసం రాజ్యాంగాన్ని అతి సులువుగా సవరించడానికి అవకాశం ఉండదు. అలా ఉంటే రాజ్యాంగం తన ఔన్నత్యం కోల్పోతుంది. రాజ్యాంగాన్ని సవరించడానికి ప్రత్యేక మెజార్టీ కావలసి ఉంటుంది. భారత రాజ్యాంగంలోని చాలా భాగాలు ప్రత్యేక మెజార్టీ ద్వారానే సవరించాలి. కాబట్టి భారత రాజ్యాంగం మౌలికంగా దృఢమైంది.

Current Affairs: ఆగ‌స్టు 30వ తేదీ.. టాప్ కరెంట్ అఫైర్స్ ఇవే!

భారత రాజ్యాంగంలో ఉన్న ఏక కేంద్ర లక్షణాలు

భారత రాజ్యాంగంలో పైన పేర్కొన్న అన్ని సమాఖ్య లక్షణాలున్నాయి. అయితే కొన్ని ఏకీకృత లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీని ఆధారంగా, భారత సమాఖ్య నిజమైన సమాఖ్య కాదని, అర్ధ సమాఖ్య అని విమర్శకులు వర్ణించారు. భారత రాజ్యాంగ నిర్మాతలు సంప్రదాయ సమాఖ్య వ్యవస్థ స్వభావంతో విభేదించి, భారతదేశానికి అనువైన సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేశారు. అందువల్ల కొంత కేంద్ర ఆధిపత్యం, కొన్ని ఏక కేంద్ర లక్షణాలు చొప్పించారు. అవి కింది విధంగా ఉన్నాయి.

ఒకే రాజ్యాంగం
సమాఖ్యలకు ప్రత్యేక రాజ్యాంగాలుంటాయి. కానీ భారతదేశంలో కేంద్ర, రాష్ట్రాలకు కలిపి ఒకే రాజ్యాంగం ఉంటుంది.   

ఏక పౌరసత్వం
సాధారణంగా సమాఖ్యల్లో ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది. ఉదా: అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పౌరులకు రెండు పౌరసత్వాలున్నాయి. కానీ భారత సమాఖ్యలో రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు ఏక పౌరసత్వ విధానాన్ని కల్పించింది. అంతేకాకుండా, పౌరసత్వానికి సంబంధించిన చట్టాలను రూపోందించడం, అమలుపర్చడం మొదలైన అంశాలపైన పార్లమెంట్‌కు మాత్రమే అధికారం ఉంటుంది.

Pharmexcil Award: యూజియా ఫార్మాకు ఫార్మెక్సిల్ ప్లాటినం స్టార్ అవార్డు

ఏకీకృత సమగ్ర న్యాయ వ్యవస్థ
సమాఖ్య వ్యవస్థల్లో కేంద్రానికి, రాష్ట్రాలకు వేర్వేరుగా న్యాయశాఖలుంటాయి. అంటే న్యాయశాఖ విభజన ఉంటుంది. కానీ భారత సమాఖ్యలో కేంద్ర, రాష్ట్రాలకు ఒకే న్యాయవ్యవస్థ ఉంది. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానంగా వ్యవహరిస్తూ కేంద్ర, రాష్ట్ర చట్టాలను సమీక్షిస్తుంది. రాష్ట్ర చట్టాలని పరిశీలించడానికి ప్రత్యేక కోర్టులు లేవు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతే నియమిస్తారు. దేశంలో ఒకే విధమైన నేర శిక్షాస్మృతి అమలులో ఉంది.

అఖిల భారత సర్వీసులు
సమాఖ్యలో కేంద్రానికి రాష్ట్రాలకు ప్రత్యేకంగా సివిల్‌ సర్వీసులుంటాయి. భారత సమాఖ్య వ్యవస్థలో కేంద్రం, రాష్ట్రాలకు వేర్వేరుగా సర్వీసులు ఉన్నప్పటికీ ఉమ్మడిగా వర్తించే అఖిల భారత సర్వీసులు ఉండటం సమాఖ్య విధానానికి విరుద్ధం. ఈ సర్వీసుల్లో యూపీఎస్‌సీ ఎంపిక చేసిన అభ్యర్థులను రాష్ట్రపతి నియమిస్తారు. వీరు కేంద్ర ప్రభుత్వానికే బాధ్యులై ఉంటారు. రాష్ట్ర పరిపాలనలో కీలకపదవుల్లో నియమితులై, కేంద్ర, రాష్ట్ర చట్టాలను అమలు చేస్తారు.

అత్యవసర అధికారాలు
వివిధ అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి అసాధారణ అధికారాలను కల్పించింది. జాతీయ అత్యవసర పరిస్థితి (ప్రకరణ 352), రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి (ప్రకరణ 356), ఆర్థిక అత్యవసర పరిస్థితి (ప్రకరణ 360)  ఈ మూడు రకాలైన అత్యవసర పరిస్థితుల్లో కేంద్రం అసాధారణ అధికారాలను పొందుతుంది. ఈ సమయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉన్న అధికార విభజన రద్దవుతుంది. అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి బదిలీ అవుతాయి. రాజ్యాంగ సమాఖ్య స్వరూపం ఎలాంటి రాజ్యాంగ సవరణ లేకుండానే ఏక కేంద్ర వ్యవస్థగా మారిపోతుంది.

Medical college Admissions: మెడికల్‌ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభం

#Tags