భారత్‌తో అత్యధిక భూసరిహద్దును పంచుకుంటున్న దేశం ఏది?
1. భారత్‌తో అత్యధిక భూసరిహద్దును పంచుకుంటున్న దేశం ఏది?
1) చైనా
2) నేపాల్
3) పాకిస్తాన్
4) బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 4
2. కర్కాటక రేఖ (23½° ఉత్తర అక్షాంశం) కింద పేర్కొన్న ఏ రాష్ట్రం ద్వారా వెళ్లదు?
1) మిజోరాం
2) త్రిపుర
3) మేఘాలయ
4) జార్ఖండ్
- View Answer
- సమాధానం: 3
3. సింధూ నదిని ‘ఇండస్’ అని ఎవరు పిలిచారు?
1) పర్షియన్లు
2) గ్రీకులు
3) డచ్‌వారు
4) ఫ్రెంచ్‌వారు
- View Answer
- సమాధానం: 2
4.భారతదేశ ఉత్తర, దక్షిణ చివరల మధ్య దూరం ఎంత?
1) 3,214 కి.మీ.
2) 2,933 కి.మీ.
3) 1,324 కి.మీ.
4) 3,514 కి.మీ.
- View Answer
- సమాధానం: 1
5. 82బీని తూర్పు రేఖాంశం ఎన్ని రాష్ట్రాల ద్వారా వెళుతోంది?
1) 6
2) 7
3) 8
4) 5
- View Answer
- సమాధానం: 4
6. రాడ్‌క్లిఫ్ రేఖ ఏ దేశాల మధ్య సరిహద్దుగా ఉంది?
1) భారత్ - పాకిస్తాన్
2) భారత్ - చైనా
3) భారత్ - మయన్మార్
4) భారత్ - బంగ్లాదేశ్
- View Answer
- సమాధానం: 1
7. పాంబన్ దీవి వేటి మధ్య ఉంది?
1) భారత్ - శ్రీలంక
2) భారత్ - మాల్దీవులు
3) భారత్ - ఇండోనేషియా
4) భారత్ - మారిషస్
- View Answer
- సమాధానం: 1
8. కింద పేర్కొన్న ఏ రాష్ట్రాలకు తీరరేఖ, విదేశాలతో భూ సరిహద్దు ఉన్నాయి?
1) గుజరాత్, మహారాష్ట్ర
2) గుజరాత్, పశ్చిమబెంగాల్
3) పశ్చిమబెంగాల్, త్రిపుర
4) పశ్చిమబెంగాల్, తమిళనాడు
- View Answer
- సమాధానం: 2
9. లక్షదీవుల రాజధాని ఏది?
1) సిల్వస్సా
2) పోర్ట్ బ్లెయిర్
3) కవరత్తి
4) పాండిచ్చేరి
- View Answer
- సమాధానం: 3
10. మలబార్ తీరం ఏ రాష్ట్రానికి ఉంది?
1) గోవా
2) మహారాష్ట్ర
3) కేరళ
4) ఒడిశా
- View Answer
- సమాధానం: 3
11. ‘డంకన్ పాస్’ వేటి మధ్య ఉంది?
1) ఉత్తర అండమాన్, తూర్పు అండమాన్
2) అండమాన్, నికోబార్ దీవులు
3) ఉత్తర అండమాన్, దక్షిణ అండమాన్
4) గ్రేట్ అండమాన్, లిటిల్ అండమాన్
- View Answer
- సమాధానం: 4
12. భారతదేశంలోని మొత్తం దీవుల (Distant Islands) సంఖ్య?
1) 240
2) 247
3) 204
4) 194
- View Answer
- సమాధానం: 2
13. ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్‌లో ఏ పేరుతో పిలుస్తారు?
1) జోంగ్మా
2) కోమలాంగిని
3) సాగరమాత
4) చోగొరీ
- View Answer
- సమాధానం: 3
14. మిష్మి కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
1) ఉత్తరాఖండ్
2) నాగాలాండ్
3) అరుణాచల్ ప్రదేశ్
4) బీహార్
- View Answer
- సమాధానం: 3
15. భారతదేశంలో ఎత్తై కనుమ ఏది?
1) బుర్జిలా
2) కారకోరం
3) ఖార్దూంగ్లా
4) జోజిలా
- View Answer
- సమాధానం: 3
16.ఫిర్ పంజాల్, దౌలాధార్ పర్వత శ్రేణులు ఎక్కడ ఉన్నాయి?
1) హిమాద్రి హిమాలయాలు
2) హిమాచల్ హిమాలయాలు
3) శివాలిక్ కొండలు
4) ట్రాన్స్ హిమాలయాలు
- View Answer
- సమాధానం:2
17. భారతదేశంలో అతిపెద్ద నదీ ఆధారిత దీవి ఏది?
1) గోవిందసాగర్
2) మజులీ
3) బైసాలా
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
18. సాత్పురా పర్వతాల్లో ఎత్తై శిఖరం ఏది?
1) అమర్ కంటక్
2) మైకుల
3) పంచమర్హి
4) ధవళగిరి
- View Answer
- సమాధానం: 3
19. హిమాలయాలు ఏ యుగంలో ఆవిర్భవించాయి?
1) ప్లిస్టోసీన్
2) టెర్షియోరరీ
3) కేంబ్రియన్
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం:2
20. సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) అమృత్సర్
2) సిమ్లా
3) డెహ్రాడూన్
4) త్రివేండ్రం
- View Answer
- సమాధానం: 3
21. కొడెకైనాల్ ఏ కొండల్లో ఉంది?
1) యాలకుల కొండలు
2) పళని కొండలు
3) బాబా బుడాన్ గిరికొండలు
4) తమిళనాడు కొండలు
- View Answer
- సమాధానం: 2
22. మహేంద్రగిరి శిఖరం ఏ పర్వతాల్లో ఉంది?
1) వింధ్య
2) సాత్పురా
3) పశ్చిమ కనుమలు
4) తూర్పు కనుమలు
- View Answer
- సమాధానం: 4
23. ముంబై - నాసిక్‌ను కలిపే కనుమ ఏది?
1) థాల్‌ఘాట్
2) బోర్ఘాట్
3) పాల్ఘాట్
4) కలహట్టి
- View Answer
- సమాధానం: 2
24. సాడిల్ పీక్ ఎక్కడ ఉంది?
1) నికోబార్ దీవులు
2) అండమాన్ దీవులు
3) సుహేలి దీవులు
4) మినికాయ్ దీవులు
- View Answer
- సమాధానం: 2
25. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ’ ఎక్కడ ఉంది?
1) చెన్నై
2) పనాజీ
3) బెంగళూరు
4) కొచ్చిన్
- View Answer
- సమాధానం: 2
26. ‘గ్రీష్మ రుతువు’ కాలం ఏది?
1) మార్చి, ఏప్రిల్
2) మే, జూన్
3) జూలై, ఆగస్టు
4) సెప్టెంబర్, అక్టోబర్
- View Answer
- సమాధానం: 2
27.భారత వాతావరణ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?
1) కోల్‌కతా
2) హైదరాబాద్
3) పుణే
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 3
28.అధిక వర్షపాతం సంభవించే ‘మాసిన్ రామ్’ ఏ రాష్ట్రంలో ఉంది?
1) మణిపూర్
2) అసోం
3) నాగాలాండ్
4) మేఘాలయ
- View Answer
- సమాధానం: 4
29. జాతీయ వరద నియంత్రణ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1) 1956
2) 1975
3) 1954
4) 1974
- View Answer
- సమాధానం: 3
30.భారతదేశంలో ఎత్తై జలపాతం ఏది?
1) దూద్‌సాగర్
2) జోగ్
3) రకిమ్కుండ్
4) కుంతల
- View Answer
- సమాధానం: 2
31. కాలబైశాఖీలు అనే రుతుపవన ఆరంభ జల్లులు ఏ రాష్ట్రంలో కురుస్తాయి?
1) ఉత్తరప్రదేశ్
2) పశ్చిమబెంగాల్
3) అసోం
4) కేరళ
- View Answer
- సమాధానం: 2
32. లానినో, ఎల్నినోలు ఎక్కడ సంభవిస్తాయి?
1) హిందూ మహాసముద్రం
2) పసిఫిక్ మహాసముద్రం
3) అట్లాంటిక్ మహాసముద్రం
4) బంగాళాఖాతం
- View Answer
- సమాధానం: 2
33.భారతదేశంలో అత్యధికంగా వర్షపాతాన్నిచ్చే రుతుపవనాలు ఏవి?
1) ఆగ్నేయ రుతుపవనాలు
2) వాయువ్య రుతుపవనాలు
3) నైరుతి రుతుపవనాలు
4) ఈశాన్య రుతుపవనాలు
- View Answer
- సమాధానం: 3
34. ఈశాన్య రుతుపవనాల వల్ల అధికంగా వర్షపాతం పొందే రాష్ట్రం ఏది?
1) కేరళ
2) కర్ణాటక
3) ఆంధ్రప్రదేశ్
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 4
35. విస్తీర్ణపరంగా అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?
1) మధ్యప్రదేశ్
2) ఛత్తీస్‌గఢ్
3) మిజోరాం
4) ఉత్తరప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
36. తీర ప్రాంతాల్లో అత్యధికంగా తుపాన్లకు గురయ్యే రాష్ట్రం ఏది?
1) తమిళనాడు
2) ఒడిశా
3) గోవా
4) అసోం
- View Answer
- సమాధానం: 2
37. భారతదేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది?
1) లఢక్
2) బికనీర్
3) లే
4) జైసల్మీర్
- View Answer
- సమాధానం: 4
38. మనదేశంలో అధిక విస్తీర్ణంలో ఉన్న అడవులు ఏవి?
1) క్షారజల అరణ్యాలు
2) సతతహరిత అరణ్యాలు
3) ఆకురాల్చే అడవులు
4) చిట్టడవులు
- View Answer
- సమాధానం: 3
39. డచిగామ్ దుప్పి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఉత్తరాంచల్
2) జమ్ము-కశ్మీర్
3) బీహార్
4) హిమాచల్ ప్రదేశ్
- View Answer
- సమాధానం: 2
40. అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) మార్చి 21
2) మార్చి 22
3) మార్చి 29
4) మార్చి 24
- View Answer
- సమాధానం: 1
41. ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ను ఎప్పుడు ప్రారంభించారు?
1) 1992
2) 1991
3) 1990
4) 1994
- View Answer
- సమాధానం: 1
42. మనదేశంలో మొదటి టైగర్ రిజర్వ్ కేంద్రం ఏది?
1) కజిరంగా
2) బందీపూర్
3) నామ్దఫా
4) సిమిపాల్
- View Answer
- సమాధానం: 2
43. భారతదేశంలో అత్యధిక విస్తీర్ణంలో ఉన్న నేలలేవి?
1) చిత్తడి నేలలు
2) ఒండలి నేలలు
3) నల్ల నేలలు
4) ఎర్ర నేలలు
- View Answer
- సమాధానం: 4
44. సాయిల్ అండ్ ల్యాండ్ యూజ్ సర్వే ఆఫ్ ఇండియాను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1951
2) 1954
3) 1958
4) 1960
- View Answer
- సమాధానం: 3
45. కేంద్రీయ అటవీ నేలల పరిశోధన సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) బళ్లారి
2) కోటా
3) పసద్
4) ఊటీ
- View Answer
- సమాధానం: 4
46. చేతివేళ్ల ఆకారంలో జరిగే క్రమక్షయాన్ని ఏమంటారు?
1) వట క్రమక్షయం
2) వంక క్రమక్షయం
3) అవనాళికా క్రమక్షయం
4) వాలు క్రమక్షయం
- View Answer
- సమాధానం: 2
47. వరి పంటను ఏ మృత్తికల్లో అత్యధికంగా పండిస్తారు?
1) ఎర్ర నేలలు
2) ఒండ్రు నేలలు
3) నల్లరేగడి నేలలు
4) జేగురు నేలలు
- View Answer
- సమాధానం: 2
48. వేదకాలంలో ‘చంద్రభాగ’గా పేర్కొన్న నది ఏది?
1) రావి
2) చినాబ్
3) బియాస్
4) సట్లేజ్
- View Answer
- సమాధానం: 2
49. బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్‌లో ఏమని పిలుస్తారు?
1) మజిలీ
2) పద్మా
3) మేఘన
4) ఐరావతి
- View Answer
- సమాధానం: 3
50. ‘దక్షిణ గంగ’ అని ఏ నదిని పిలుస్తారు?
1) నర్మద
2) తపతి
3) గోదావరి
4) కృష్ణా
- View Answer
- సమాధానం: 3
51. రామ్గంగ తీరంలో ఉన్న కాంస్య నగరం ఏది?
1) ఉజ్జయినీ
2) రూర్కెలా
3) మొరాదాబాద్
4) ఫిరోజ్‌పూర్
- View Answer
- సమాధానం: 3
52. ‘కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం’ ఏ రాష్ట్రంలో ఉంది?
1) రాజస్థాన్
2) గుజరాత్
3) ఉత్తరప్రదేశ్
4) తమిళనాడు
- View Answer
- సమాధానం: 4
53. దేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది?
1) సాంబర్
2) ఊలార్
3) చిల్కా
4) లోక్తక్
- View Answer
- సమాధానం: 2
54. బాగ్ల్లీహర్ ప్రాజెక్ట్ విషయంలో భారత్‌కు ఏ దేశంతో వివాదం ఉంది?
1) నేపాల్
2) చైనా
3) బంగ్లాదేశ్
4) పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 4
55. బాబ్ల్లీ ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైంది?
1) కర్ణాటక -ఆంధ్రప్రదేశ్
2) మహారాష్ట్ర - తెలంగాణ
3) తమిళనాడు -కర్ణాటక
4) కేరళ - తమిళనాడు
- View Answer
- సమాధానం: 2