TSPSC Groups Exams 2023 : ఇక టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1,2,3,4 ఉద్యోగాల భర్తీకి దారేటు..? పాత నోటిఫికేషన్లు కొనసాగేనా..?
అయితే గత ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్స్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందా.. లేదా..? కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇస్తారా.. అనే అయోమయంలో అభ్యర్థులు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం గత ప్రభుత్వ ఇచ్చిన గ్రూప్-1,2,3,4 పరీక్షలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో.. ఎప్పుడు పరీక్షలు జరిగే అవకాశం ఉందో లేదో కింది ప్రత్యేక కథనం ద్వారా తెలుసుకోండి.
☛ టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1,2,3&4 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్-3, గ్రూప్–4 నోటిఫికేషన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అవి ప్రస్తుతం వివిధ దశలలో ఉన్నాయి. తాజాగా తెలంగాణలో ప్రభుత్వం మారిపోవడంతో వీటి పరిస్థితి ఎలా ఉండనుందో చూద్దాం.
503 టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ఉద్యోగాల పరిస్థితి..?
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసి ఇప్పటికే రెండుసార్లు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. అయితే తాజాగా హైకోర్టు రెండోసారి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షను కూడా రద్దు చేయడంతో మరోసారి పరీక్ష నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని మీద ఇప్పటివరకు టిఎస్పిఎస్సి స్పష్టమైన ప్రకటన విడుదల చేయలేదు. గ్రూప్-1 కి మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే నూతన ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని హమీ ఇచ్చింది.ఈ నేపథ్యంలో ప్రస్తుత నోటిఫికేషన్ రద్దు చేసి నూతన నోటిఫికేషన్ విడుదల చేస్తుందా లేదా మరో నోటిఫికేషన్ విడుదల చేస్తుందా. అనేది చూడాల్సి ఉంది.
780 గ్రూప్-2 ఉద్యోగాలకు దారేటు..?
టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష ఇప్పటికే రెండుసార్లు వివిధ కారణాలతో వాయిదా పడింది. 780 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2కి 783 పోస్టులకు గాను దాదాపు 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తాజా షెడ్యూల్ ప్రకారం జనవరి 6 7 తేదీలలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలు కూడా జరగుతాయో లేదో అనే అనుమానం అభ్యర్థులల్లో వ్యక్తం అవుతున్నాయి.
ఏ దారిలేని.. 1,375 గ్రూప్-3 ఉద్యోగాల పరిస్థితి..?
గ్రూప్–3 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–3 నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఇప్పటివరకు పరీక్షల షెడ్యూల్ విడుదల చేయలేదు. నూతన ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. గ్రూప్–3 కేటగిరీలో 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కొక్క ఉద్యోగానికి సగటున 390 మంది పోటీ పడుతున్నారు.
8,039 గ్రూప్–4 ఉద్యోగాల భర్తీ లైన్ క్లియర్ అయేనా..?
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 8,039 గ్రూప్–4 పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసి పరీక్ష నిర్వహించింది. అలాగే ప్రాథమిక, తుది కీలను కూడా విడుదల చేసింది. ఈ పరీక్షకు అత్యధికంగా 9,51,205 మంది దరఖాస్తు చేశారు. అలాగే జూలై 1వ తేదీన పరీక్ష నిర్వహించగా.. పేపర్ -1కు 7,63,835 మంది, పేపర్ –2కు 7,61,026 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాల విడుదల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. నూతన ప్రభుత్వం వీలైనంత త్వరగా తుది ఫలితాలను విడుదల చేసి పోస్టింగ్స్ ఇచ్చే అవకాశం ఉంది.
☛ టీఎస్‌పీఎస్సీ Groups → ప్రివియస్ పేపర్స్ → ఎఫ్‌ఏక్యూస్ → ఆన్‌లైన్ క్లాస్ → ఆన్‌లైన్ టెస్ట్స్