TS High Court Serious On TSPSC Negligence : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిందే.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : తెలంగాణ హైకోర్టులో టీఎస్‌పీఎస్సీకి మరోసారి చుక్కెదురైంది. TSPSC గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సమర్ధించింది. ప్రిలిమ్స్ రద్దును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
TS High Court Serious On TSPSC

ప్రిలిమ్స్‌ను మళ్లీ నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశిస్తూ.. సెప్టెంబ‌ర్ 27వ తేదీన (బుధవారం) తీర్పు వెలువరించింది. జూన్ 11వ తేదీన‌ నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తూ ఈనెల 23న హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

☛➤ TSPSC Group 1 Prelims- 2023 Exam Question Paper with Key (Click Here)

ఈ సారి అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్‌ తీసుకోవాలని..

ఈ తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను టీఎస్‌పీఎస్సీ ఆశ్రయించింది. దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ విఫలం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. టీఎస్‌పీఎస్సీ రూల్స్‌ పాటించలేదని, పరీక్షను సరిగా నిర్వహించలేకపోయిందని మండిపడింది.

☛➤ టీఎస్‌పీఎస్సీ Group 1 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

అప్పీల్‌పై మంగళవారం విచారణ చేపట్టిన డివిజన్‌ బెంచ్‌.. టీఎస్‌పీఎస్సీపై ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రశ్న పత్రాల లీకేజీతో ఒకసారి గ్రూప్‌-1 పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహిస్తున్నపుడూ మళ్లీ అదే నిర్లక్ష్యమా? గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోరా? బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొని దాన్ని ఎందుకు అమలు చేయలేదు? మీ నోటిఫికేషన్‌లోని నిబంధనలను మీరే ఉల్లంఘిస్తారా? అలా ఎందుకు జరిగింది? లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. వారి ఆశలను నీరుగారుస్తారా’’ అని టీఎస్‌పీఎస్సీని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని.. వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించింది. అనంతరం సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. ఈ మేరక ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేస్తూ.. ప్రిలిమ్స్‌ను మళ్లీ నిర్వహించాలని తీర్పు వెల్లడించింది. ఈ సారి అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్‌ తీసుకోవాలని తెలిపింది.

☛➤ Competitive Exams: పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌వుతున్నారా... అయితే ఈ త‌ప్పులు అస్స‌లు చేయ‌కండి

రెండుసార్లు కూడా..


ఇదిలా ఉండగా గతేడాది అక్టోబరు 16న తొలిసారి ప్రిలిమ్స్‌ నిర్వహించగా.. ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో ఆ పరీక్షను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. మళ్లీ ఈ ఏడాది జూన్‌ 11న ప్రిలిమ్స్‌ నిర్వహించగా.. ఈ పరీక్షను కూడా రద్దు చేస్తున్నట్లు ఇటీవల హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇచ్చింది. దీంతో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రెండుసార్లు రద్దు అయ్యింది.

2022 ఏప్రిల్‌ 26న ఏకంగా 503 పోస్టులతో తెలంగాణలో తొలి గ్రూప్‌-1 ప్రకటనను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3,80,202 మంది దరఖాస్తు చేశారు. అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమ్స్‌ నిర్వహించగా 2,85,916 మంది హాజరయ్యారు. టీఎస్‌పీఎస్సీ వీరి నుంచి 1:50 నిష్పత్తిలో 25 వేల మందిని ఈ ఏడాది జనవరిలో మెయిన్స్‌కు ఎంపిక చేసింది. జూన్‌లో ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూలు వెలువరించింది. అనూహ్యంగా ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్‌ ఆ పరీక్షను రద్దు చేసింది. తిరిగి జూన్‌ 11న ప్రిలిమ్స్‌ నిర్వహించగా 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 

#Tags