e-Pan Card: కేవలం పది నిమిషాల్లోనే ఈ-పాన్ కార్డు పొందండి ఎలా..?

పాన్ కార్డు తప్పనిసరి కానప్పటికీ ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్) ఫైలింగ్ చేయడానికి, బ్యాంక్ ఖాతా తెరవడం కోసం, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేయడం మొదలైన వాటికి కేవైసీ పూర్తి చేయ‌డానికి కచ్చితంగా పాన్ అవ‌స‌రం.

అయితే, ఈ పాన్ కార్డు కోసం ఇంట్లో నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం మనం గంటల తరబడి గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదు, కేవలం 10 నిమిషాల్లో తయారు చేయవచ్చు. ఈ-పాన్ కార్డు కోసం మనం ప్రత్యేకంగా ఎలాంటి ఫీజు లేదా ఛార్జీలు అవసరం లేదు. ఈ-పాన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ-పాన్ కార్డు పొందడం ఎలా?

https://www.incometax.gov.in/iec/foportal/ వెళ్లి హోమ్ పేజీలో '' Our Service " విభాగంలో  'ఇన్ స్టంట్ ఈ-పాన్' ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

➤ ఇప్పుడు 'Get New e-PAN' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

➤ తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, చెక్ బాక్స్ క్లిక్ చేయండి.

➤ ఆధార్ నంబర్ తో లింకు చేసిన మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి.

➤ ఇప్పుడు మీ ఆధార్ వివరాలను చెక్ చేసి మెయిల్ ఐడీ ఇవ్వకపోతే, ఇచ్చి సబ్మిట్ క్లిక్ చేయండి.

☛ తర్వాత మీరు చెక్ స్టేటస్, డౌన్ లోడ్ పాన్ కార్డ్ మీద క్లిక్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్ లో పొందవచ్చు.

#Tags