World Tallest Residential Building : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నివాస భవనం ఇదే.. దీని ప్రత్యేకతలు చూస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!

ఆకాశ హర్మ్యాలకు కేరాఫ్‌ అయిన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌.. మరో ఘనతను దక్కించుకోబోతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నివాస భవనానికి దుబాయ్‌ వేదిక కాబోతోంది. దుబాయ్‌ పరిధిలో ఆర్థిక ప్రాంతంగా పేరున్న ‘బిజినెజ్‌ బే’లో వంద ఫ్లోర్లతో నిర్మించిన ఈ హైపర్‌టవర్‌ గిన్నిస్‌ రికార్డు ఘనతను సొంతం చేసుకోవడానికి సిద్ధమైంది.

అంతకు ముందు ఈ రికార్డు న్యూయార్క్‌ నగరం(అమెరికా) మాన్‌హట్టన్‌ 57వ స్ట్రీట్‌లోని సెంట్రల్‌ పార్క్‌ టవర్‌ పేరిట ఉంది. ఆ భవనంలో 98 ఫ్లోర్స్‌ ఉన్నాయి. ఇక.. ఎత్తు 472 మీటర్ల రికార్డును సైతం దుబాయ్‌ హైపర్‌టవర్‌ అధిగమించనుంది. కేవలం ఎత్తులోనే కాదు.. అత్యంత విలాసవంతమైన నివాస భవనంగానూ ఇది రికార్డు సృష్టించడానికి సిద్ధమైంది.

Eviation Alice : ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్‌ విమానం ఎగిరిందిలా.. దీని ప్రత్యేకతలు ఇవే..

ఈ భ‌వ‌నం రాత్రిపూట..

దుబాయ్‌లో ఈ హైపర్‌టవర్‌ను ప్రపంచ రికార్డు నెలకొల్పే ఉద్దేశంతోనే నిర్మిస్తున్నట్లు నిర్మాణ కంపెనీలు ప్రకటించాయి. ఎమిరేటి ప్రాపర్టీ డెవలప్‌మెంట్‌ కంపెనీ ‘బింఘట్టి’, ప్రముఖ వాచ్‌మేకర్‌ కంపెనీ ‘జాకోబ్‌ అండ్‌ కో’ సంయుక్తంగా ఈ భవనాన్ని నిర్మించాయి. దీంతో.. ఈ భవనానికి బుర్జ్‌ బింఘట్టి జాకోబ్‌ అండ్‌ కో రెసిడెన్సీగా నామకరణం చేశారు. దీని అగ్రభాగాలు.. డైమండ్‌ ఆకారంలో ఉండడం ఈ భవనానికి ఉన్న మరో ప్రత్యేకత కాగా, రాత్రిపూట మిరుమిట్లు గొలిపే లైట్ల వెలుతురులో ఎంతో ఆకర్షణీయంగా ఉంది ఈ ఆకాశ హర్మ్యం. పూర్తిగా డబుల్‌, త్రిబుల్‌ బెడ్‌ రూంలతో పాటు ప్రత్యేకమైన సదుపాయాలెన్నింటినో ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ. చివరి ఐదు ఫ్లోర్‌లలో అత్యంత విలాసవంతమైన పెంట్‌హౌజ్‌లను ఏర్పాటు చేశారు. అయితే.. ఈ భవనం ప్రారంభ తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు.

Tallest Buildings in World: ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనాలు ఉన్న‌ నగరం ఏమిటో మీకు తెలుసా..?

#Tags