ప్రపంచ హృదయ దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు?
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవం జరుపుకుంటారు. హృదయ సంబంధ వ్యాధుల నివారణ, ప్రపంచ వ్యాప్తంగా వాటి ప్రభావంపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ రోజు లక్ష్యం.
థీమ్:
ప్రపంచ హృదయ దినోత్సవం 2020 థీమ్ “సీవీడీ వ్యాధులను ఓడించటానికి మీ హృదయాన్ని ఉపయోగించుకోండి”. సీవీడీ భూమిపై ఎన్నో మరణాలకు ఒక కారణం. ధూమపానం, డయాబెటిస్, అధిక బీపీ, అనారోగ్యకరమైన ఆహార విధానాలు, కాలుష్యం వంటి వివిధ కారణాల వల్ల కావచ్చు.
చరిత్ర:
- ప్రపంచ హృదయ దినోత్సవాన్ని 1999లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)తో కలిసి వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ (డబ్ల్యూహెచ్‌ఎఫ్) స్థాపించింది.
- 1997-1999 వరకు వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ (డబ్ల్యూహెచ్‌ఎఫ్) అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు ఆంటోని బేయెస్ డి లూనా దీన్ని ప్రారంభించారు.
- 2011 వరకు ఈ దినోత్సవాన్ని సెప్టెంబర్ చివరి ఆదివారం జరుపుకునేవారు. మొదటి సారి సెప్టెంబర్ 24, 2000న జరుపుకున్నారు.
#Tags