ఆగస్టు 30న అంతర్జాతీయ బలవంతంగా అదృశ్యమైన‌ బాధితుల దినోత్సవం

బలవంతపు అదృశ్యాల బాధితుల అంతర్జాతీయ దినోత్సవం ఆగస్టు 30న జరుపుకుంటారు.
అరెస్టు, నిర్బంధం, కిడ్నాప్ వంటి వాటి వ‌ల్ల క‌నిపించ‌కుండా పోయిన వ్య‌క్తుల స్వేచ్ఛ గురించి ప్ర‌చారం చేయ‌డం, ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌లిగించ‌డం ఈ రోజు ల‌క్ష్యం.
చరిత్ర:
  • అంతర్జాతీయ సంస్థ జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా ఈ అంతర్జాతీయ దినోత్సవం ఏర్పాటు చేశారు. యుఎన్‌ జనరల్ అసెంబ్లీ (UNGA) ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో క‌నిపించ‌కుండా పోతున్న వ్యక్తుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళ‌న చెంది ఈ తీర్మానాన్ని ఆమోదించింది.
  • అదృశ్యానికి కారణం అరెస్టు, నిర్బంధం, కిడ్నాప్‌. బలవంతంగా అదృశ్యం అవుతున్న వ్యక్తుల రక్షణ బాధ్యత‌ను స‌మావేశంలో యుఎన్‌జీఏ స్వీకరించింది. అందుకే ఆగస్టు 30ను బలవంతపు అదృశ్య బాధితుల అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించాలని నిర్ణయించింది.
  • ఈ రోజును మొట్టమొదటిసారిగా 2011లో పాటించారు. ఈ స‌మస్య ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఉండ‌డం వ‌ల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తోంది. అదృశ్యమైన సాక్షులు లేదా అదృశ్యమైన వ్యక్తుల బంధువులపై పెరుగుతున్న‌ వేధింపులు, బెదిరింపులకు సంబంధించి సమస్యలను ఆపడం కూడా ఈ రోజు లక్ష్యం.
#Tags