గాంధీ శాంతి బహుమతి
ప్రతిష్టాత్మక అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సెప్టెంబర్ 9, 2015వ తేదీన ఇస్రోకు ప్రదానం చేశారు. ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ ఈ అవార్డును స్వీకరించారు. ఈ నేపథ్యంలో ‘గాంధీ శాంతి బహుమతి’పై క్విక్‌రివ్యూ...
ఏర్పాటు
జాతిపిత మహాత్మగాంధీ గౌరవార్థం భారత ప్రభుత్వం ఏటా ఈ అవార్డును అందజేస్తుంది. గాంధీ 125వ జయంతిని పురస్కరించుకొని 1995లో ఈ అంతర్జాతీయ అవార్డును ఏర్పాటుచేసింది. గాంధీ అనుసరించిన మార్గాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ తదితర రంగాల్లో విశేష మార్పులకు కారణమైన వ్యక్తులకు, సంస్థలకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. దేశం, భాష, లింగం, జాతి తారతమ్యం లేకుండా ఎవరైనా ఈ అవార్డుకు అర్హులే.
ఎంపిక
ప్రధానమంత్రి నేతృత్వంలోని ఎంపిక కమిటీ అవార్డు విజేతలను ఎంపిక చేస్తుంది. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరో ఇద్దరు ప్రముఖులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఇప్పటివరకూ 14 మందికి/సంస్థలకు ఈ అవార్డు అందజేశారు. 1995లో మొదటిసారిగా ఈ అవార్డును టాంజానియా తొలి అధ్యక్షుడు జూలియస్ న్యెరేరేకు ప్రదానం చేశారు. అవార్డు కింద రూ. కోటి నగదు బహుమతి, ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందజేస్తారు.
గ్రహీతలు
భారతీయులు
బాబా ఆమ్టే(1999) - సామాజిక కార్యకర్త
చండీ ప్రసాద్ భట్(2013) - పర్యావరణవేత్త
విదేశీ ప్రముఖులు
జూలియస్ న్యెరేరే(1995) - టాంజానియా
ఏటీ అరియరత్నే(1996) - శ్రీలంక
గెర్హర్డ్ ఫిశ్చర్(1997) - జర్మనీ
నెల్సన్ మండేలా(2000) - దక్షిణాఫ్రికా
జాన్ హుమే(2001) - ఐర్లాండ్
వాక్లావ్ హావెల్(2003) - చెక్ రిపబ్లిక్
కొరెట్టా స్కాట్ కింగ్(2004) - అమెరికా
డెస్మండ్ టుటు(2005) - దక్షిణాఫ్రికా
భారతీయ సంస్థలు
రామకృష్ణమిషన్ (1998)
భారతీయ విద్యా భవన్ (2002)
ఇస్రో (2014)
విదేశీ సంస్థలు
గ్రామీణ బ్యాంకు (2000)- బంగ్లాదేశ్- మహ్మద్ యూనస్ స్థాపించారు.

#Tags