IISER: ఐసర్ ప్రవేశాలకు దరఖాస్తులు విడుదల.. చివరి తేదీ ఇదే..
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్)లలో ప్రవేశానికి సంబంధించి రిజిస్ట్రేషన్, దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 25వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
మే 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఐఐఎస్‌ఈఆర్ అడ్మిషన్ టెస్టు (ఐఏటీ) జూలై 3న జరగనుంది. ఈ సారి మార్కింగ్ ప్యాట్రన్ లో ఐసర్ మార్పులు చేసింది. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు ఇస్తారు. తప్పుడు సమాధానానికి 0.75 మార్కులు కోత విధిస్తారు. ఐఐఎస్‌ఈఆర్ అడ్మిషన్స్.ఐఎన్, లేదా ఐఐఎస్‌ఈఆర్‌మొహాలి.ఏసీ.ఐఎన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారానే కాకుండా ఐఐఎస్‌ఈఆర్‌లలోకి జేఈఈ మెయిన్ నుంచి జేఈఈ అడ్వాన్స్ డ్‌కు అర్హత సాధించిన టాప్ 15,000 మందికి కూడా అవకాశం కల్పిస్తారు. అలాగే స్టేట్ సెంట్రల్ బోర్డు (ఎస్‌సీబీ) నిర్వహించే కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై) ద్వారా కూడా అభ్యర్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. కేవీపీవై ద్వారా ప్రవేశాలు పొందగోరే వారు కేవీపీవై ఆప్టిట్యూడ్ టెస్టును రాయాల్సి ఉంటుంది.
#Tags