APSET Halltickets Released: ఏపీసెట్ 2024 అడ్మిట్‌కార్డులు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష(AP SET)-2024 అడ్మిట్ కార్డులు విడుదల అయ్యాయి. అభ్యర్థులు ఈమెయిల్ ఐడీ/ మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఏపీసెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం ఏప్రిల్ 28న రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష నిర్వహిస్తున్నారు. మొత్తం 30 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించనున్నారు.
పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కడప, కర్నూలు జిల్లాల్లో పరీక్ష నిర్వహణ కోసం ఇప్పటికే అధికారులు ఏర్పట్లు చేశారు.
AP SET 2024 హాల్‌టికెట్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
- ముందుగా అఫీషియల్ వెబ్‌సైట్ apset.net.in ను క్లిక్ చేయండి.
- హోం పేజీలో కనిపిస్తున్న AP SET 2024 లింక్‌పై క్లిక్ చేయండి.
- మొభైల్ నెంబర్/ఈమెయిల్ ద్వారా లాగిన్ అవ్వండి
- తర్వాత పేజీలో కనిపిస్తున్న AP SET 2024 హాల్‌టికెట్ డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేయండి.
#Tags