RGUKT: ట్రిపుల్ ఐటీలో జాతీయ ఐక్యతా దినోత్సవం
భైంసా: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీలో అక్టోబర్ 31న సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవం నిర్వహించారు.
డైరెక్టర్ సతీశ్‌కుమార్ మాట్లాడుతూ దేశ ఉక్కుమనిషిగా ప్రసిద్ధి చెందిన సర్ధార్ వల్లభాయ్‌పటేల్ ఒక న్యాయవాదిగా, నాయకుడిగా దేశాభివృద్ధికి ప్రజలందరినీ ఏకతాటిపై తీసుకొచ్చారని అన్నారు.
చదవండి: Basara Triple IT: ట్రిపుల్‌ఐటీ విద్యార్థులతో ముఖాముఖి
1947 నుంచి 1950 వరకు దేశ ఉప ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా పనిచేశారని తెలిపారు. ఆయన స్ఫూర్తిగా దేశ ఐక్యతను బలోపేతం చేయడం ఎంతో అవసరమని, పటేల్ చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్స్ సృజన, డాక్టర్ పావని, డాక్టర్ విజయ్‌కుమార్, అధ్యాపకులు ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.
#Tags