IIIT-Basara: ప్రవేశాల మెరిట్ జాబితా విడుదల తేదీ ఇదే..
బాసర ట్రిపుల్ ఐటీలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన మెరిట్ జాబితాను ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ ఆగస్టు 22న విడుదల చేస్తారని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సతీశ్‌కుమార్ తెలిపారు.
RGUKT బాసరలో ఈ సంవత్సరం నుంచి EWS కోటా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మొత్తం 1,500 సీట్లలో స్పెషల్ కేటగిరీ కింద 96 సీట్లు పోగా మిగిలిన 1,404 సీట్లలో వివిధ రిజర్వేషన్లకు గాను 702 సీట్లు, మిగిలిన జనరల్ కేటగిరీలోని 702 సీట్లలో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 140 సీట్లు కేటాయిస్తామని వివరించారు. దీంతోపాటు 75 గ్లోబల్ సీట్లు, 30 ఎన్నారై సీట్లు కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
చదవండి:
#Tags