NMPA Recruitments: ఎన్‌ఎంపీఏ, మంగళూరులో 33 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 33.
పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ డైరెక్టర్–01, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్–01, అకౌంట్స్ ఆఫీసర్(గ్రేడ్–1)–01, లా ఆఫీసర్(గ్రేడ్–1)–01, డిప్యూటీ డైరెక్టర్(రీసెర్చ్)–01, సీనియర్ మెడికల్ ఆఫీసర్–01, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్–01, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్–02, అసిస్టెంట్ ఇంజనీర్–14, ఇంజనీర్(గ్రేడ్–1)–04, జూనియర్ డైరెక్ట్‌ర్–01, మాస్టర్(గ్రేడ్–2)–01, పీఏ టూ హెచ్‌వోడీ–01, డిప్యూటీ డైరెక్టర్(ఈడీపీ)–01, అసిస్టెంట్ సెక్రటరీ(గ్రేడ్–1)–01, స్పోర్ట్స్ ఆఫీసర్–01.
అర్హత:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ(లా), బీఈ/బీటెక్(సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్), ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు:
45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం:
నెలకు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్, స్పోర్ట్స్ ఆఫీసర్ పోస్టులకు రూ.40,000 నుంచి రూ.1,40,000, మిగతా పోస్టులకు రూ.50,000 నుంచి రూ.1,60,000.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు,సర్టిఫికేట్‌ల పరిశీలన ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: 27.12.2024.
వెబ్‌సైట్: http://newmangaloreport.gov.in