TS ECET Schedule 2023 : టీఎస్ ఈసెట్–2023 షెడ్యూల్ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..?
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఈసెట్-2023షెడ్యూల్ విడుదలైంది. మార్చి 1వ తేదీన టీఎస్ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
మార్చి 2వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. రూ. 500 ఆలస్యం రుసుంతో మే 8వ తేదీ వరకు, రూ. 2,500తో మే 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తులను మే 8 నుంచి మే 12వ తేదీ వరకు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
☛ AP ECET 2023: పరీక్ష తేదీ ఇదే..
హాల్ టికెట్లు డౌన్‌లోడ్ మాత్రం..
మే 15వ తేదీ నుంచి అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 20వ తేదీ ఈసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ టీఎస్ ఈసెట్-2023 షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి విడుదల చేశారు.
☛ TS EAMCET Exam Schedule 2023 : టీఎస్ ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే.. ఏఏ పరీక్ష ఎప్పుడంటే..
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే..
ప్రవేశ పరీక్షలు | యూనివర్సిటీ | పరీక్షల తేదీలు |
ఎంసెట్ | JNTUH | 07-05-2023 To 14-05-2023 |
ఎడ్‌సెట్ | Mahatma Gandhi University | 18-05-2023 |
ఈసెట్ | OU | 20-05-2023 |
లాసెట్ | OU | 25-05-2023 |
పీజీ ఎల్‌సెట్ | OU | 25-05-2023 |
ఐసెట్ | Kakatiya University | 26-05-2026 & 27-05-2023 |
పీజీఈసెట్ | JNTUH | 29-05-2023 To 31-05-2023 |
#Tags