ఏపీలో ‘ఎంసెట్ పకడ్బందీగా నిర్వహించాలి’

బాలాజీ చెరువు (కాకినాడ): ఏప్రిల్ 29న జరిగే ఏపీ ఎంసెట్-2016 ను పకడ్బందీగా నిర్వహించాలని పరీక్ష నిర్వహణ కమిటీ చైర్మన్, జేఎన్‌టీయూ-కె ఉప కులపతి వీఎస్‌ఎస్ కుమార్ ఆదేశించారు.
కాకినాడ జేఎన్‌టీయూ సమావేశ హాలులో గురువారం జరిగిన ఎంసెట్ రీజినల్ కో ఆర్డినేటర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా పరీక్ష కేంద్రాలను ఎంపిక చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు చెప్పారు. ఈ ఏడాది రాజమహేంద్రవరంలో కొత్తగా రీజినల్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. హైదరాబాద్‌లో పరీక్ష నిర్వహించే అంశాన్ని త్వరలో తెలియజేస్తామన్నారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
#Tags