TG DSC 2024 Results Link: టీఎస్ డీఎస్సీ-2024 ఫలితాలు విడుదల... ఈ సారి మాత్రం ఇలా...
మొత్తం 11,062 టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెల్సిందే. టీఎస్ డీఎస్సీ పరీక్షలను జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్ ద్వారా నిర్వహించారు. TS DSC-2024 ఫలితాలను ప్రత్యేకంగా www.sakshieducation.comలో చూడొచ్చు. TS DSC 2024 Results కోసం https://results.sakshieducation.com/Results2024/telangana/DSC/2024/tg-dsc-results-2024.html ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
ఈ ఫలితాల కోసం దాదాపు 2.50 లక్షల మంది...
అలాగే ఇటీవలే ఈ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ & ఫైనల్ కీ ని ఇటీవలే విడుదల చేశారు. ఈ డీఎస్సీ ఫలితాల కోసం దాదాపు 2.50 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.
TS DSC 2024 Results కోసం క్లిక్ చేయండి
టెట్ మార్కులను కలిపి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను..
తాజాగా డీఎస్సీ తుది కీ విడుదలవడంతో త్వరలోనే ఫలితాలు (TS DSC Result 2024) కూడా ప్రకటించనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. అయితే టెట్ పరీక్ష అనంతరం వచ్చిన మార్కులను డీఎస్సీ దరఖాస్తులో నమోదు చేయలేదని కొందరు, మార్కులు, హాల్‌టికెట్, సబ్జెక్ట్ ఎంట్రీ వంటి పలు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో తప్పులు దొర్లాయని మరికొందరు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయంకి చేరుకుని సవరణకు అవకాశం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల విజ్ఞప్తులపై స్పందించిన విద్యాశాఖ.. రెండు రోజులపాటు టెట్ వివరాల నమోదుకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో డీఎస్సీ మార్కులకు టెట్ మార్కులను కలిపి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను విడుదల చేస్తారు.
1:3 నిష్పత్తిలో మెరిట్ లిస్టు..
ఈ ప్రక్రియ ముగిస్తే టెట్ మార్కుల అప్‌డేట్ చేసేందుకు ఇక అవకాశం ఇండదు. దీంతో తప్పుల సవరణకు మరో అవకాశం ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ ముందుకొచ్చింది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత 1:3 నిష్పత్తిలో మెరిట్ లిస్టు ప్రకటిస్తారు. వారందరికీ డీఈవోలు ధ్రువపత్రాల పరిశీలన జరుపుతారు. అనంతరం నియామక పత్రాలు అందజేస్తారు.
How to check TG DSC 2024 Results ?
Telangana DSC 2024 results are expected to be released this week or on September 4th week.
- Visit TG DSC https://results.sakshieducation.com/Results2024/telangana/DSC/2024/tg-dsc-results-2024.html
- Click on TG DSC Merit list.
- Click on your district.
- The selected candidates list for certificate verifications will be displayed.
- The final selected candidates list will be displayed after certificate verification.
TS DSC 2024 Vacancies List :
- Physical Education Teacher: 182
- SGT, Secondary Grade Teacher: 6508
- School Assistant: 2629
- Language Pandits: 727
- Special Education Teachers in Primary Level: 796
- Special Education Teachers in Upper Primary/Secondary Level in Government and Local Body Schools: 220
Here are the details of SGT and School Assistant posts by district :
- Hyderabad: 537 SGT posts (highest)
- Peddapalli: Only 21 SGT posts
- Khammam: 176 School Assistant posts (highest)
- Medchal Malkajgiri: 26 posts
- Adilabad: 74 School Assistant and 209 SGT posts
- Nalgonda: 383 SGT posts
- Hanumakonda: 158 School Assistant and 81 SGT posts
- Jagtial: 99 School Assistant and 161 SGT posts
- Suryapet: 86 School Assistant and 224 SGT posts
- Yadadri: 84 School Assistant and 137 SGT posts
మార్కులను కలిపిన తర్వాత రిజల్ట్స్ విడుదల చేయాలి..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహించిన మొదటి డీఎస్సీలో అధికారుల నిర్లక్ష్యం వల్ల తాము మార్కులు కోల్పోతున్నామన్నారు. ప్రైమరీ కీ ను ఆగస్టు 13 న రిలీజ్ చేశారని... అందులో తప్పులు ఉన్నాయని మొరపెట్టుకున్నామని , తిరిగి ఫైనల్ కీ లో కూడా అదే తరహా తప్పులు దొర్లాయన్నారు. అధికారులకు ఆ తప్పులకు సంబందించిన అన్ని వివరాలను అందజేశామని తెలిపారు. ఫైనల్ కీ లో తప్పులను సరిదిద్ది.., తాము కోల్పోయిన మార్కులను కలిపి , రిజల్ట్స్ విడుదల చేయాలని కోరారు.
ఫైనల్ 'కీ'పై అభ్యర్థుల అభ్యంతరాలు ఇవే..
ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఇలా అంటారు?
1)ఏకాదేశం
2)ఆదేశం
3)బహుళము
4)నిత్యము
అయితే అధికారులు విడుదల చేసిన తుది కీ ప్రకారం సరైన సమాధానం ఆప్షన్ 2) ఆదేశం అని ఇచ్చారు. కానీ అభ్యర్థులు ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1) ఏకాదేశం అంటున్నారు. ఇదే ప్రశ్న ఈ ఏడాది మే లో జరిగిన టెట్ పరీక్షలోనూ ఇచ్చారు. ఫైనల్ కీలో సమాధానం ఏకాదేశం ఇచ్చారని, కానిప్పుడు డీఎస్సీలో 'ఆదేశం' ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు సరైన సమాధానం.. ఇప్పుడు డీఎస్సీలో ఎందుకు తప్పవుతుందని ప్రశ్నిస్తున్నారు. పుస్తకాల్లోనూ కరెక్ట్ ఆన్సర్ 'ఏకాదేశం' ఉందని అంటున్నారు.
భారత ఉపరాష్ట్రపతి వీరిచే ఎన్నుకోబడతారు?
1) పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన మరియు నామినేట్ చేయబడిన సభ్యులు
2)అన్ని రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఎన్నికైన ఎమ్మెల్యేలు
3)లోక్‌సభ మరియు రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు మాత్రమే
4)అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు,పార్లమెంట్ సభ్యులు
కానీ అభ్యర్థులు చెబుతున్న దాని ప్రకారం సరైన జవాబు ఆప్షన్ 3 అంటున్నారు. పుస్తకాల్లోనూ ఇదే జవాబు ఉందని ఆధారాలు చూపిస్తున్నారు.
'డ్నీపర్, వోల్గా వంటి నదులు ఈ ప్రాంతంలో ఉద్భవించాయి' అనే ప్రశ్నలో 'నైపర్’ అనే పదం అనువాదం తప్పుగా పడింది. దీనికి మార్కును కలపాలి.
మనం మానసికంగా ఆరోగ్యవంతుడు అని చెప్పినప్పుడు.. అది ఈ క్రింది అంశాల పరంగా ఆరోగ్యకరమని అర్థం' ఈ ప్రశ్నకు ఏ, బీ, సీ, డీ నాలుగు ఆప్షన్లు సరైనవి.
పట్టణాలు, గ్రామాల్లో మీరు అత్యంత ఇష్టపడేవి ఏవీ అను ప్రశ్న ఈ విద్యాప్రమాణాన్ని సాధించేందుకు ఉద్ధేశించినది' దీనికి సమకాలీన సమస్యలపై ప్రతిస్పందన, ప్రశ్నించుట సరైన సమాధానం.
ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్‌లో 'ఇన్‌విట్రో' అంటే అక్షరాలా అర్థం అన్న ప్రశ్నకు ప్రయోగశాలలో అన్నది కూడా సరైన సమాధానం.
ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ పవర్ పార్క్‌ను ఈ రాష్ట్రంలో ప్రారంభించారు' అన్న ప్రశ్న ఇచ్చారు. కానీ ఇంగ్లిష్‌లో శక్తిస్థల అన్న పేరు ఇచ్చి తెలుగులో ఈ పేరును ఇవ్వలేదు. కనుక దీనికి మార్కు కలపాలి.
అభ్యర్థుల అభ్యంతరాల నేపథ్యంలో డీఎస్సీ ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశముంది. వంద మందికి పైగా అభ్యర్థులు ఫైనల్ కీపై అభ్యంతరాలు వ్యక్తంచేయగా, వాటిని పరిశీలించి మరోసారి సబ్జెక్టు నిపుణుల కమిటీకి ఆధారాలు పంపిస్తామని పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. తప్పులు నిజంగానే దొర్లాయని నిపుణుల కమిటీ గుర్తిస్తే మళ్లీ రివైజ్డ్ 'కీ'ని విడుదల చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత డీఎస్సీలో వచ్చిన మారులు, టెట్ మారులను కలిపి జీఆర్‌ఎల్(జనరల్ ర్యాంకింగ్ లిస్ట్)ను విడుదల చేస్తారు. అనంతరం 1:3 జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టి మెరిట్ ప్రకారం నియామక పత్రాలను అందజేస్తారు. అయితే తుది 'కీ' లోనూ తప్పులు దొర్లితే ఈ ప్రక్రియంతా జరగడానికి కాస్త సమయం పట్టే అవకాశముంది.