Good News For DSC Candidates : డీఎస్సీ-2024 అభ్యర్థులకు గుడ్‌న్యూస్..
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు జూలై 18వ తేదీ నుంచి జరగనున్న విషయం తెల్సిందే.
అయితే ఒకే రోజు రెండు సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డీఎస్సీ పరీక్షలు ఉన్నవారు ఉదయం ఎగ్జామ్ రాసిన సెంటర్‌లోనే రెండోదానికి హాజరుకావచ్చని విద్యాశాఖ తెలిపింది. కొందరు అభ్యర్థులు నాన్ లోకల్ పోస్టులకు అప్లై చేయడంతో వారికి ఇతర జిల్లాలో కేంద్రాలిచ్చింది. దీంతో ఉదయం ఒక జిల్లాలో మధ్యాహ్నం మరొక జిల్లాలో పరీక్ష ఉండటంతో వారికి హాల్ టికెట్లు మార్చి ఇస్తామని పేర్కొంది.
#Tags