Brother and Sister Success Story : ఒకేసారి మేము ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాం ఇలా.. మా చిన్నప్పుడే నాన్న చనిపోయినా.. మా అమ్మ...
కానీ ఈమె కష్టంకు నేడు పతిఫలం వచ్చింది. ఈమె బిడ్డలు ఇద్దరు ఒకే సారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వీరే తెలంగాణలోని వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంకు చెందిన మహేశ్‌కుమార్, మౌనిక. ఈ నేపథ్యంలో వీరి మహేశ్‌కుమార్, కుమార్తె సక్సెస్ స్టోరీ మీకోసం..
కుటుంబ నేపథ్యం :
వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బల్ల పద్మ, సోమయ్యల కుమారుడు మహేశ్‌కుమార్, కుమార్తె మౌనిక.
వీరి జిల్లా స్థాయిలోనే..
మహేశ్‌కుమార్, మౌనిక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల విడుడల చేసి డీఎస్సీ ఫలితాల్లో వీరు ఉద్యోగాలు సాధించారు. ఎట్టకేలకు ఎంతో అన్నాచెల్లెకు ప్రభుత్వ ఉద్యోగాలు వరించాయి. ఎస్జీటీలో మహేశ్ 5వ ర్యాంకు, మౌనిక 15వ ర్యాంకు సాధించి గ్రామానికే వన్నె తెచ్చారు.
బీడీలు చుట్టి..
వీరి తండ్రి చిన్నప్పుడే మృతి చెందగా, తల్లి కష్టపడి బీడీలు చుట్టి ఉన్నత చదువులు చదివించింది. అన్నాచెల్లె ఉపాధ్యాయులుగా ఎంపిక కావడంతో వారి తల్లి ఆనందం వ్యక్తం చేసింది. అలాగే గ్రామస్తులు వీరిని అభినందించారు. ఈ అన్నాచెల్లెలు విజయం నేటి యువతరంకు ఎంతో స్ఫూర్తినిస్తుంది.
➤☛ TG DSC 2024 Ranker Success Story : ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో చదివి.. టీచర్ ఉద్యోగం కొట్టానిలా... నా భార్య కూలీ చేసి.. !