ఏఎన్‌యూ దూరవిద్య పరీక్ష ఫీజు గడువు పెంపు
ఏఎన్‌యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్శిటీ దూరవిద్యా కేంద్రం ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహించనున్న క్యాలెండ ర్ ఇయర్ బ్యాచ్ పరీక్షల ఫీజును అక్టోబర్ 30 లోగా చెల్లించాలని డైరక్టర్ ఆచార్య పి. శంకరపిచ్చయ్య తెలిపారు.
ఈ పరీక్ష ఫీజు చెల్లించేందుకు అక్టోబర్ 23 తేదితోనే గడువు ముగిస్తుందని, ఈ నేపథ్యంలో గడువును పొడగించామన్నారు. అయితే రూ. 100 ఆలస్య రుసుముతో నవంబర్ 7 వరకు, రూ. 500తో నవంబర్ 13 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.