T20 Cricket: టి20 చరిత్రలో అత్యంత చెత్త రికార్డు.. 10 పరుగులకే ఆలౌట్.. ఆ జట్టు ఏదంటే?

టి20లంటే ఎప్పుడు మెరుపులేనా? అప్పుడప్పుడు మలుపులుంటాయి. బౌలింగ్‌ దెబ్బలూ ఉంటాయి. బ్యాటర్లు, బ్యాటింగ్‌ జట్లే కాదు. పొట్టి క్రికెట్లో అరివీర భయంకర బౌలింగ్, బౌలర్లు కూడా ఠారెత్తిస్తారు.

స్పెయిన్‌ జట్టు కూడా అదే పని చేసింది.  ఫిబ్రవరి 26 స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ‘ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌’ అనే చిన్న ద్వీపదేశాన్ని క్రికెట్‌ చరిత్రలో నిలిచేంతగా దెబ్బ కొట్టింది. స్పానిష్‌ బౌలర్ల ధాటికి 11 మంది బరిలోకి దిగిన ‘ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌’ క్రికెట్‌ జట్టు అంతా కలిసి 10 పరుగులకే ఆలౌటైంది. ఇదో రికార్డు అయితే 11 పరుగుల లక్ష్యాన్ని స్పెయిన్‌ జట్టు రెండు సిక్సర్లతో పూర్తి చేయడం మరో విశేషం. మొదట బ్యాటింగ్‌ చేసిన ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌ జట్టు 8.4 ఓవర్లలో 10 పరుగులకు కుప్పకూలింది. ఇందులో ఆరుగురు డకౌట్ అయ్యారు. అతీఫ్‌ 4 వికెట్లలో ‘హ్యాట్రిక్‌’ కూడా ఉంది. 

T20 World Cup: ఆరోసారి టి20 ప్రపంచకప్‌ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా

11 పరుగుల విజయ లక్ష్యాన్ని స్పెయిన్‌ బ్యాటర్‌ అవైస్‌ అహ్మద్‌ (12 నాటౌట్‌; 2 సిక్సర్లు) ఒక్కడే ముగించేశాడు. ‘ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌’ బౌలర్‌ జోసెఫ్‌ తొలి బంతి నోబాల్‌ వేయగా, 2, 3 బంతుల్ని అవైస్‌ భారీ సిక్సర్లుగా బాదాడు. 6 మ్యాచ్‌ల సిరీస్‌ను స్పెయిన్‌ 5–0తో కైవసం చేసుకుంది. వానతో రెండో టి20 రద్దయ్యింది. ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌ చెత్త రికార్డుతో రెండు రికార్డులు కనుమరుగయ్యాయి. అంతర్జాతీయ క్రికెట్లో చెక్‌ రిపబ్లిక్‌తో 2019లో జరిగిన పోరులో టర్కీ అత్యల్ప స్కోరు (21 ఆలౌట్‌) తెరమరుగైంది.
ఇక ఓవరాల్‌ టి20 ఫార్మాట్‌లో అడిలైడ్‌ స్ట్రయికర్స్‌ ధాటికి సిడ్నీ థండర్స్‌ గత ఆగస్టులో 15 పరుగులకు ఆలౌటైన రికార్డు కూడా చెదిరిపోయింది. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ)లో ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌ జట్టు 2017లో అసోసియేట్‌ సభ్య దేశంగా మారింది. 2018లో టి20 ప్రపంచకప్‌ యూరోప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో పోటీపడి ఆరో స్థానంలో నిలిచింది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

#Tags